మహమ్మారితో పోరాడి గెలిచారు సినీ నటుడు, నిర్మాత . ఇటీవలే కరోనా బారిన పడిన ఆయన.. కొన్ని రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండి చివరకు కోవిడ్- 19 నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయి పలు విషయాలపై స్పందిస్తున్న బండ్ల గణేష్.. తాజాగా ప్రముఖ మీడియాతో ముచ్చటించి కరోనాను జయించిన విధానాన్ని, కోవిడ్- 19 పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ముందుగా తనలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, అయితే ఓ రోజు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లగా అక్కడి వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకోమని చెప్పడంతో చేయించుకోగా.. పాజిటివ్ అని తెలిసి షాక్ అయ్యానని అన్నారు బండ్ల గణేష్. అయితే ఆ వెంటనే తన ఇంటి పైభాగంలో ఉన్న గదిలోకి వెళ్లి 14 రోజుల పాటు ఆ గదిలోనే ఒంటరిగా క్వారంటైన్‌లో ఉంటూ పౌష్టికాహారం తీసుకున్నానని ఆయన తెలిపారు. డాక్టర్ల సలహా తీసుకుని ఆ మేరకు మందులు వాడుతూ ఉదయం, సాయంత్రం గుడ్లు తినేవాడినని, అలాగే వేడి నీళ్లతో పుక్కిలించడం, ఆవిరి పట్టుకోవడం లాంటివి చేసేవాడినని చెప్పారు. Also Read: శ్వాస వ్యాయామాలు, విటమిన్ టాబ్లెట్లు రెగ్యులర్‌గా వాడేవాడినని బండ్ల గణేష్ చెప్పారు. తన గదిని ఓ మెడిటేషన్ రూమ్‌గా మార్చేసుకున్నానని తెలిపిన ఆయన.. కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలని, ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా వైద్యుల సలహాలు తీసుకుంటూ విటమిన్ ఫుడ్ తీసుకోవాలని అన్నారు. ఇదే కరోనాను జయించే ప్రధాన ఆయుధమని ఆయన చెప్పారు. కరోనా అనేది ప్రపంచ విపత్తు అని, ఎవ్వరూ విమర్శలు చేయకూడదని ఆయన అన్నారు. ప్లాస్మా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెస్సారు బండ్ల గణేష్. ఇకపోతే తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించే అవకాశం వస్తే మరోసారి రెడీ అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZK4GA5
No comments:
Post a Comment