Sunday 17 November 2019

దమ్ముంటే వర్మగాడ్ని పట్టుకోండి.. పప్పు అన్నది వాడే: ‘టచ్ చేసి చూడు’ అంటున్న వంశీ

బెల్లం దగ్గరకు చీమలు చేరినట్టు.. వివాదం ఎక్కడుంటే అక్కడ వాలిపోతుంటాడు వివాదాల దర్శకుడు వర్మ. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంతో ఏపీ రాజకీయ వర్గాల్లో వివాదాన్ని రాజేసిన వర్మ.. తాజాగా వల్లభనేని వంశీ టీడీపీపై గుప్పిస్తున్న ప్రకంపనల్ని సైతం క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించాడు వర్మ. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్.. ఇతర ముఖ్య నాయకులపై వల్లభనేని వంశీ చేస్తున్న తీవ్ర ఆరోపణలు, ఫైరింగ్ ఇంటర్వ్యూలు చూసిన తరువాత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందంటూ ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్‌ను సీక్వెల్‌కు ఫిక్స్ చేశాడు వర్మ. ఇదిలా ఉంటే.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ బాబుని కించపరుస్తూ పప్పు లాంటి అబ్బాయి అనే ప్రోమో సాంగ్‌ను విడుదల చేశాడు వర్మ. ఈ పాటపై పెద్ద వివాదమే నడుస్తున్న సందర్భంలో వల్లభనేని వంశీ కూడా లోకేష్ బాబుని పప్పు అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటూ లోకేష్ బాబుని పప్పు అని ప్రత్యేకించి నేను అన్నది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను లోకేష్ బాబుని ఎప్పుడూ అన్న అని నేను అనలేదు. అతను నాకంటే చిన్నవాడు.. బాబు అనే అనేవాడిని. లోకేష్‌ని పప్పు అని, గున్న ఏనుగు అని నేను అనలేదు. ఎవడో రామ్ గోపాల్ వర్మ అనేవాడు అన్నాడు. అది ఒక కోటిమంది చూశారు. నేను పప్పు అని అన్నానా? పప్పు లాంటి అబ్బాయి అనే పాట నేను తీశానా? చెప్పండి. వాడెవడ్నో అడిగితే గూగుల్‌లో అని కొట్టు చూడు అన్నాడు. నాకు నిజంగానే తెలియక.. గూగుల్‌లో ఏపీ పప్పు అని కొట్టా. మీరు కూడా కొట్టి చూడండి. పేరు రాకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా. ప్రత్యేకించి లోకేష్‌ను నేను పప్పు అని అనడం ఏంటి? ఎవడో రామ్ గోపాల్ వర్మ అనేవాడు పప్పు అని అన్నాడు. వాడు ఎక్కడో బొంబాయిలో ఉంటాడు ఎవరికీ కనిపించడు కాబట్టి వాడ్ని కెలికితే ఇంకేం తీస్తాడో అని భయం వీళ్లకు. చెరుకురసం తీయగా ఉందని.. పాలు తీయగా ఉంటాయని.. పప్పు వేసినట్టు చూపిస్తాడో అని రామ్ గోపాల్ వర్మని ఏం చేయలేక నన్ను అంటారేంటి? మీకు దమ్ముంటే వర్మగాడ్ని పట్టుకోండి వాడికి నోటీసులు ఇవ్వండి. ఎక్కడున్నాడో ఆ రామ్ గోపాల్ వర్మ బయటకు లాగండి. వాడు ‘రెడ్డి రాజ్యంలో కమ్మ ఫ్యాన్స్’ అని సినిమా తీస్తానంటున్నాడు. ఎవడి ఇష్టం వాడిది. నేను కూడా ‘టచ్ చేసి చూడు’ అని సినిమా తీశా. ఎవడైనా నన్ను టచ్ చేస్తే కరెంట్ షాక్ ఏమైనా తగులుతుందా? నేను వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడా.. అయితే మా అబ్బాయినే అన్నాడని మీరు ఎలా అంటారు. మీ అబ్బాయి కాకుండా రాజకీయాల్లో ఇంకెవరూ లేరా? నేను ఇప్పటి వరకూ చాలా సరళమైన భాషలోనే మాట్లాడా? వాళ్లే వివాదం చేసుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు వల్లభనేని వంశీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35aymGs

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...