Thursday, 28 November 2019

ఈ రోజు రిలీజ్‌ కావాల్సిన మరో సినిమా కూడా వాయిదా పడింది!

కోలీవుడ్ స్టార్‌ హీరో హీరోగా, లెజెండరీ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎన్నై నోకి పాయుమ్ తోట. గౌతమ్‌ మీనన్‌ స్వయంగా నిర్మించిన ఈ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు గౌతమ్‌ మీనన్‌. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించటం లేదు. ధనుష్‌ లాంటి స్టార్‌ హీరో నటించిన సినిమాకు ఆర్థిక కష్టాలు రావటంపై సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కొంత తేరుకున్న గౌతమ్‌ మీనన్‌, ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించాడు. తమిళ్‌తో పాటు తెలుగులో తూటా పేరుతో ఈ సినిమా రిలీజ్‌ కు ప్లాన్‌ చేశాడు. గత నెల ఈ సినిమా రిలీజ్‌కు డేట్ ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా పడింది. Also Read: ఈ రోజు (29-11-2019) తూట రిలీజ్‌ అంటూ ప్రకటించారు చిత్రయూనిట్. పెద్దగా ప్రమోషన్‌ చేయకపోయినా సినిమాను వదిలేసి చేతులు దులుపుకోవాలని భావించారు. కానీ మరోసారి గౌతమ్‌ సినిమాను విడుదల చేయటంలో ఫెయిల్ అయ్యాడు. తెలుగుతో పాటు, చాలా చోట్ల తమిళ వర్షన్‌ రిలీజ్‌ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా ఈ రోజు రిలీజ్‌ లేనట్టే అన ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌లో మరో డేట్‌ కోసం ఇప్పటికే ఆలోచిచటం మొదలు పెట్టారట గౌతమ్‌ మీనన్‌ టీం. ఓ స్టార్‌ హీరోతో స్టార్‌ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌ విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొవటం ఇదే తొలిసారి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి ఇప్పటికైన తూటా కష్టాలు తీరి ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ds9q1n

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...