Sunday, 17 November 2019

ఇప్పుడు మీ టైమొచ్చింది.. డైరెక్టర్‌కు సమంత స్వీట్ విషెస్

స్టార్ హీరోయిన్, అక్కినేనివారి కోడలు సమంత సెట్‌లో అందరితోనూ చాలా సరదాగా ఉంటారని, ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తారని ఇండస్ట్రీలో అంటుంటారు. షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌లో ప్రతి ఒక్కరినీ సమంత పలకరిస్తారట. వాళ్లతో సరదాగా మాట్లాడతారట. అంతేకాదు, అందరి గురించి అడిగి తెలుసుకుంటారట. అందుకే, డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌తో మొదటిసారి కలిసి పనిచేస్తున్నా ఆయన గురించి మొత్తం తెలుసుకున్నారు సమంత. ఈరోజు ఆయన పుట్టినరోజు అని తెలుసుకుని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సమంత శుభాకాంక్షలు తెలిపిన తరవాత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విష్ చేసింది. Also Read: ప్రస్తుతం సమంత ‘96’ రీమేక్‌లో నటిస్తున్నారు. శర్వానంద్ హీరో. తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘జాను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అక్టోబర్‌లో ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, విశాఖపట్నం, మాల్దీవులు, కెన్యాలో ఈ సినిమా షూటింగ్‌ను జరిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు. Also Read: కాగా, ఈరోజు దర్శకుడు ప్రేమ్ కుమార్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్‌కు సమంత శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా ప్రియమైన దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఇంకా ఎంతో కాలం మీ టైం ఇలానే కొనసాగాలి. మ్యాజిక్‌ను మరోసారి ఆవిష్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు.’’ అని సమంత ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్‌తో తాను ఉన్న సినిమా వర్కింగ్ స్టిల్‌ను కూడా ట్వీట్‌‌లో పొందుపరిచారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XkLbve

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....