Sunday 24 November 2019

గారు వద్దు ప్లీజ్.. సాయి పల్లవికి నాగ చైతన్య రిక్వెస్ట్

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నాగ చైతన్యకు 19వ సినిమా. అంతేకాదు.. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇదే తొలి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, నిన్న (నవంబర్ 23న) నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సాయి పల్లవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కలమషంలేని చిరునవ్వు, దయగల హృదయం కలిగిన మనిషి చే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని సాయి పల్లవి నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఈరోజు నాగ చైతన్య స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు థ్యాంక్స్ చెప్పారు. అయితే, తనను ‘గారు’ అని సంబోధించొద్దని సాయి పల్లవిని చైతూ రిక్వెస్ట్ చేశారు. ఇలా పిలిచి తన వయస్సును పెంచేవద్దన్నారు. అయితే, ఈ కాన్వర్జేషన్ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సాయి పల్లవి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి కాంబినేషన్‌లో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, తన భార్య సమంత చేసిన ట్వీట్‌కు కూడా నాగ చైతన్య స్పందించారు. కాకపోతే చాలా ఆసల్యంగా. ‘‘హ్యాపీ బర్త్ డే మై లవ్. నువ్వు సంతోషంగా ఉండాలని ప్రతి రోజూ నేను ప్రార్థిస్తాను. రోజురోజుకి నీకు నువ్వే ఉత్తమంగా ఎదగడం చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. మనిద్దరం కలిస్తే ఎంతో దృఢంగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఐ లవ్ యూ డార్లింగ్ హస్బెండ్’’ అని సమంత శనివారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నాగ చైతన్య ఆదివారం స్పందించారు. సింపుల్‌గా ‘థ్యాంక్యూ మై లవ్’ అని రిప్లై ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KMa9hR

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz