Sunday, 24 November 2019

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌.. సూపర్ స్టార్ సరికొత్త రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లెక్కలు స్పష్టం చేస్తు్న్నాయి. శక్రవారం విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కేవలం 40 గంటల్లో 20 మిలియన్లకు పైగా రియల్‌టైమ్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. అంతేకాదు, 40 గంటలకు పైగా యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది ఈ టీజర్. ఈ టీజర్‌తో సినిమాపై అటు ప్రేక్షకుల‌లో, ఇటు మ‌హేష్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. Also Read: కాగా, ఈ సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. అలాగే.. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, అజయ్, బండ్ల గణేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OAsSOI

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk