Sunday, 24 November 2019

అడవిలో అనిల్ రావిపూడి బర్త్ డే.. మహేష్ స్పెషల్ విషెస్

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి.. ఆ తరువాత వరుసగా ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’ వంటి భారీ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సంక్రాంతికి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కాగా, నిన్న (నవంబర్ 23న) అనిల్ రావిపూడి పుట్టినరోజు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ అంగమలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్‌లోనే అనిల్ రావిపూడి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సెలబ్రేషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధిపతుల్లో ఒకరైన శిరీష్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కు మహేష్ కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనిల్‌తో పనిచేయడం అన్ని విధాలుగా ఇన్‌క్రెడిబుల్ ఎక్స్‌పీరియన్స్ అని మహేష్ బాబు అన్నారు. అనిల్ మరింత సంతోషంగా ఉండాలని, మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని ఆకాంక్షించారు. Also Read: బర్త్ డే బోయ్ అనిల్ రావిపూడి.. మహేష్‌కి థాంక్స్ చెప్పారు. ‘‘మీ విషెస్‌కి చాలా థాంక్స్ సార్. మీతో వర్క్ చేయడం నాకు మెమరబుల్ జర్నీ. మీతో పని చేస్తూ ఎన్నో నేర్చుకున్నాను. ఈ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ఈ పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోలేనని, ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌కి తమ అంచనాలని మించి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు అనిల్. ఈ స్థాయి రెస్పాన్స్ రావడానికి ముఖ్య కారణమైన సూపర్ స్టార్ మహేష్ గారికి, తన టీంకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అన్నారు. కాగా, ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ని దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. నవంబర్ 22న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఒక్క రోజులోనే 18 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DhPLkx

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk