Sunday, 24 November 2019

వాళ్లు తేడాగాళ్లని ముందే పసిగట్టాలి: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

కొద్ది రోజుల్లోనే తెలుగులో టాప్‌ స్టార్‌గా ఎదిగిన అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్. చిన్న సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరితోనూ జతకట్టేసింది. అదే జోరులో కోలీవుడ్‌, బాలీవుడ్‌లలోనూ జంట పాతేసి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే తనకు హీరోయిన్‌గా బ్రేక్‌ ఇచ్చిన టాలీవుడ్‌లో మాత్రం అమ్మడి జోరు తగ్గింది. వరుస ఫెయిల్యూర్స్‌ ఎదురుకావటం, అదే సమయంతో బాలీవుడ్‌లో రకుల్ బిజీగా కావటంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. కాస్త గ్యాప్‌ తీసుకొని సీనియర్‌ హీరో నాగార్జున సరసన నటించిన మన్మథుడు 2 కూడా రకుల్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ప్రస్తుతం తమిళ్‌లో 2, హిందీలో ఒక సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. Also Read: తెలుగులో ఒక్క సినిమా మాత్రమే ఈ అమ్మడి చేతిలో ఉంది. అది కూడా ఇంకా సెట్స్‌ మీదకు రాలేదు. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాతో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. అదే సమయంలో అవకాశం ఉన్నప్పుడల్లా ప్రైవేట్‌ ఈవెంట్స్‌లోనూ సందడి చేస్తోంది. తాజాగా ఈ భామ శనివారం వైజాగ్‌లో జరిగిన `555 కిలో మీటర్ల 2.0 వాక్‌` ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి భద్రత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు చిన్న వయసు నుంచే లైగింక వేదింపుల మీద అవగాహన కల్పించాలని అభిప్రాయ పడింది రకుల్‌. Also Read: ముఖ్యంగా సమాజంలో అమ్మాయిలను ఇబ్బంది పెట్టేలా అసభ్యంగా తాకేవాళ్లు ఎక్కువవుతున్నారని, అలాంటి వాళ్లను ముందుగానే పసిగట్టేలా అమ్మాయిలను మానసికంగా సిద్ధం చేయాలనంది రకుల్‌. అలా చేసే వాళ్లు తేడాగాళ్లని ముందే పసిగట్టాలి. వారి గురించి వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన నిర్వహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OIuXrZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....