Sunday 17 November 2019

శ్రీరెడ్డి, మహేష్ కత్తి ఇంటర్వ్యూ: 11నిమిషాల ప్రోమోలో ‘నగ్న’ సత్యాలెన్ని?

కత్తి మహేష్, వివాదాస్పద వ్యక్తులుగా ఇద్దరూ ఇద్దరే. అయితే ఈ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ పవన్ కళ్యాణ్‌‌పై తరచూ ఫైర్ కావడం. ఇన్నాళ్లు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈ కాంట్రివర్సి కింగ్ అండ్ క్వీన్‌లు రూటు మార్చారు. జతగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సన్సేషనల్ ఇంటర్వ్యూ ప్రోమో వదిలారు. సుమారు 11 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో మహేష్ కత్తిని ఇంటర్వ్యూ చేస్తోంది శ్రీరెడ్డి. సిగ్గువిడవడంలో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న శ్రీరెడ్డి.. ఇది సిగ్గులేని ఎపిసోడ్ అంటూ చెప్పి మరీ ప్రోమో వదిలారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ కత్తి డబ్బులు తీసుకుని రివ్యూలు ఇస్తారా? మహేష్ కత్తిలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ఏంటి? అతను వర్జినిటీ ఎప్పుడు పోగొట్టుకున్నాడు? లాంటి బోల్డ్ ప్రశ్నలను సంధించింది శ్రీరెడ్డి. ఇక మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అని మహేష్ కత్తిని అడగటం.. దానికి మహేష్ కత్తి.. వై నాట్ అంటూ మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని పవన్ ఫ్యాన్స్ కోరుకున్నారు అంటూ తనదైన శైలిలో ఆన్సర్‌లు ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్‌పై ఈ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌కి చాలా సైకిలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. ఆ చీరకట్టుకుని డాన్స్‌లు చేయలనే కోరికలు కూడా వీటిలో భాగమే అంటున్నారు ఈ ఇద్దరూ. అతన్ని నమ్మే వాళ్లు వెధవలు అని. రాజకీయ నాయకుడిగా యాక్టింగ్ చేస్తున్నాడు. డబ్బులు కోసం సినిమాలు చేసేవాళ్లను చూశాం.. కాని పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ క్యాస్ట్యూమ్స్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి వెళ్లే అవకాశం ఉందన్నారు కత్తి. ఇక బిగ్ బాస్ ఫైనల్‌లో శ్రీరెడ్డి గురించి చిరంజీవి మాట్లాడటం అతని గౌరవాన్ని అతనే తగ్గించుకున్నారన్నారంటున్నారు కత్తి. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్‌పై ఎక్కుపెట్టిన బాణంలాగే ఉంది. శ్రీరెడ్డి, కత్తి మహేష్ ఒక్కొక్కరుగా విమర్శలు గుప్పిస్తేనే వాటిపై పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి వివాదాలను రాజేస్తుందో చూడాలి. వీరిద్దరి ఫుల్ ఇంటర్వ్యూ శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్‌లో వచ్చే ఆదివారం 6 గంటలకు ప్రసారం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NX1MCq

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...