Saturday, 23 November 2019

వాలెంటైన్స్‌ డేకి.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌`

సెన్సేషనల్‌ స్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్‌ ఫేమస్‌ లవర్‌. ఇటీవల డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో నిరాశపరిచిన విజయ్‌, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. క్లాస్‌, ఎమోషనల్‌ సినిమాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఈషాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. Also Read: తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో మరో రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్‌ దేవరకొండ. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయిన తరువాత షూటింగ్‌ను వాయిదా వేశారు. ఈ లోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు విజయ్‌. Also Read: ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో సూపర్‌ ఫాంలో ఉన్న పూరి జగన్నాథ్, తన తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. విజయ్‌ యాటిట్యూడ్‌కి, పూరి హీరోయిజ్ తోడైతే బాక్సాఫీస్‌ షేక్‌ అవుతుందంటున్నారు రౌడీ ఫ్యాన్స్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34fINs9

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk