Saturday 23 November 2019

అల్లు అర్జున్‌ రికార్డ్‌.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు పాట ఇదే!

స్టైలిష్ స్టార్‌ .. గతంలో ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని అరుదైన రికార్డ్‌ను సాధించాడు. దక్షిణాదిలో అత్యధిక మంది ఫాలోవర్స్‌ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉంది బన్నీ ఫాలోయింగ్‌. అందుకే బన్నీకి సంబంధించిన సినిమా అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాల్లో క్షణాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా మరోసారి బన్నీ సోషల్ మీడియా స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం బన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఈ సినిమాలో సామజవరగమనా పాట ఓ అరుదైన రికార్డ్‌ను సృష్టించింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి తెలుగు పాట కూడా ఇదే కావటం విశేషం. Also Read: సూపర్‌ హిట్ అయిన సామజవరగమన లిరికల్‌ సాంగ్‌కు యూట్యూబ్‌లో 1మిలియన్‌ (పది లక్షల)కు పైగా లైక్స్‌ వచ్చాయి. తెలుగు సినీ చరిత్రలో ఈ రికార్డ్‌ అందుకున్న తొలి పాటు ఇదే. మరే ఇతర సినిమా టీజర్‌, ట్రైలర్‌, వీడియో సాంగ్‌కు కూడా యూట్యూబ్‌లో ఇన్ని లైక్స్‌ రాలేదు. అందుకే ఈ అరుదైన ఘనతను తనకు అందించిన అభిమానులకు బన్నీ స్వయంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. తన ట్విటర్‌ అకౌంట్‌లో స్పందించిన బన్నీ, `మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఈ పాట కోసం పని చేసిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు` అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తమన్‌ సంగీతమందించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రీ సంగీతమందించగా సిద్‌ శ్రీరామ్‌ అద్బుతంగా ఆలపించాడు. Also Read: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్‌, చినబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సుశాంత్, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, టబు, జయరామ్‌ (మలయాళ నటుడు) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2sdj4CL

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz