Sunday, 17 November 2019

ఆ సంఘటనతో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవడమే మానేశా: సుదీప్‌

కన్నడ ఇండస్ట్రీలో హీరో పరిచయం అయి తరువాత టాలీవుడ్‌, బాలీవుడ్‌లలోనూ సత్తా చాటుతున్న నటుడు సుధీప్. అభిమానులు ప్రేమగా కిచ్చా సుదీప్ అని పిలుచుకునే ఈ విలక్షణ నటుడు తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కోట్లలో పారితోషికం అందుకుంటున్న సుదీప్‌, కేవలం రెండు, మూడు వందల రూపాయల ఖరీదు చేసే షర్టు మాత్రమే వాడతాడట. ఒకప్పుడు హంగులు ఆర్భాటాలు ఇష్టపడే వాడినన్న సుదీప్‌, ఓ సంఘటన మూలంగా తాను పూర్తిగా మారిపోయానన్నాడు. గతంలో అభిమానులు సుదీప్‌ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. ఆ వేడుకలో సుదీప్‌ కూడా ఎంజాయ్‌ చేశాడు. అయితే కార్యక్రమం పూర్తయి వెళ్లిపోతుండగా ఓ పాప కిందపడిన కేక్‌ తీసుకొని తింటున్న విషయాన్ని గమనించాడట. ఆ దృశ్యం తనని ఎంతో కలచి వేసిందన్న సుదీప్‌, ఇక జీవితంలో బర్త్ డేను అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడట. Also Read: అంతేకాదు తను వ్యక్తిగతం జీవితంలో కూడా ఈ సంఘటన ఎన్నో మార్పులకు కారణమైందన్నాడు సుదీప్‌. తన ఇంట్లో కూడా పెద్దగా ఆర్బాటాలు ఉండవన్న సుదీప్‌, తన పుట్టని రోజును కాలనీలో పెద చిన్నారులతో కలిసి జరుపుకోవాలని అభిమానులకు సూచించాడు. ప్రస్తుతం కాస్ట్‌లీ గిఫ్ట్‌లు, కటౌట్‌లు ఎంజాయ్‌ చేసే మానసిక స్థితిలో తాను లేనని చెప్పాడు. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఇటీవల పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన పహిల్వాన్‌ సినిమాలో హీరోగా నటించిన సుదీప్, తరువాత మరో జాతీయ స్థాయి సినిమా సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్‌ 3 సినిమాలో సల్మాన్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మలయాళలో ప్రియదర్శన్‌ తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం మరక్కర్‌లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీటితో పాటు కన్నడలో కోటిగొబ్బ 3లో హీరోగా నటిస్తున్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/353VbLY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....