Friday, 1 November 2019

Upasana కామెంట్ చేసిందా నాకు తెలీదే: రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ తన భార్య ఇటీవల చేసిన వైరల్ సోషల్ మీడియా పోస్ట్ గురించి స్పందించారు. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాలకు బాలీవుడ్ సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. ఒక్క దక్షిణాది నటుడికి కానీ దర్శకుడికి కానీ ఆహ్వానించలేదు. దీనిపై కొన్ని రోజుల క్రితం రామ్‌చరణ్ సతీమణి ఉపాసన బాధను వ్యక్తం చేశారు. ‘మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. అయితే కళాకారులతో జరిగిన సమావేశాన్ని కేవలం హిందీ నటీనటులకు మాత్రమే పరిమితం చేసి దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధించింది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నటి ఖుష్బూ కూడా మండిపడ్డారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయి అయినంత మాత్రాన అక్కడి నటీనటులనే వేడుకలకు ఆహ్వానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిలను ఓ సమావేశానికి ఆహ్వానించారు. త్వరలో తండ్రీ కొడుకులు దిల్లీలోని పీఎంఓ కార్యాలయంలో మోదీని కలవబోతున్నారు. అయితే ఉపాసన చేసిన ట్వీట్‌పై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఉపాసన అలా కామెంట్ చేసిన విషయం తనకు అస్సలు తెలీదని అన్నారు. ఒకవేళ మోదీని ఉద్దేశిస్తూ ఉపాసన ట్వీట్ చేస్తున్నట్లు తనకు తెలిసుంటే అలా చేయకుండా ఆపేవాడినని తెలిపారు. ఇక చెర్రీ వర్క్ విషయానికొస్తే ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు. కొద్దిరోజులు విరామం తీసుకున్నాక ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఫాస్ట్‌గా చేశారట. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆలియా భట్ రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్నారు. 2020 జూన్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/338P60j

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....