Thursday, 21 November 2019

ప్చ్ Prabhas.. 2019 మోస్ట్ ట్రోల్డ్ సినిమా ఆయనదే

‘సాహో’ సినిమా విడుదలకు ముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో.. రిలీజ్ అయ్యాక అంతకంటే ఎక్కువగా ట్రోల్ అయ్యింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. విడుదల కానంత వరకు బ్లాక్ బస్టర్ అంటూ ఈ సినిమాను మోసేశారు, కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఏకిపారేశారు. సోషల్ మీడియాలో ఈ ఏడాది అత్యధికంగా ట్రోల్ అయిన సినిమాల్లో ‘సాహో’ కూడా ఉండటం బాధాకరం. మొదటి స్థానంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ఇది. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇందుకు కారణం సినిమాలో కథ లేకపోవడం, హీరోయిన్లకు మేకప్ ఎక్కువ అవడం. దిష్టి తగలకుండా ఉండటానికి దిష్టిబొమ్మలను తగిలించినట్లు.. ఈ సినిమాలోని హీరోయిన్ల పాత్రలు కూడా ఆ దిష్టిబొమ్మల్లాగే ఉన్నాయి. హీరోయిన్లు ఇద్దరికీ ఇది తొలి సినిమా కావడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. పైగా స్టార్ కిడ్స్‌కి అవకాశాలు ఇవ్వడంలో కరణ్ జోహార్ ముందుంటాడు. ఈ సినిమాలోని ముగ్గురూ స్టార్ కిడ్సే. అందుకే వారికి యాక్టింగ్ వచ్చా రాదా అని కూడా ఆలోచించకుండా సినిమాపై భారీగా ఖర్చు పెట్టాడు. చివరకు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌ కూడా కలెక్షన్ల రూపంలో రాలేదు. కళంక్ ఈ సినిమాను కూడా కరణ్ జోహారే నిర్మించారు. ఈ సినిమాలో భారీ స్టార్లు నటంచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తలదించుకునేనా చేసింది. సినిమాను ప్రకటించినప్పుడు ‘బాజీరావ్ మస్తానీ’ స్థాయిలో ఆడుతుందేమో అనుకున్నారు. కానీ అసలు సినిమా ఎందుకు తీశారో కూడా తెలీనంత దరిద్రంగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. 2019 మోస్ట్ ట్రోల్డ్ సినిమాల్లో ‘కళంక్’ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో సాహో ఇందాక చెప్పినట్లు.. సాహో సినిమా రిలీజ్‌కు ముందు వచ్చినంత హైప్, రిలీజ్ అయ్యాక నెటిజన్లు చేసింత ట్రోలింగ్ మరే తెలుగు సినిమాకీ లేదనే చెప్పాలి. దాదాపు రెండున్నరేళ్ల పాటు సినిమా కోసం వెచ్చించి, కోట్ల కొద్ది డబ్బు పెట్టి సినిమా తీస్తే.. చివరకు మిగిలింది ఏమీ లేదని ఆడియన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు కూడా మండిపడ్డారు. హౌస్‌ఫుల్ 4 బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ఇది కూడా మల్టీస్టారర్ సినిమానే. రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు రాబట్టినా.. కంటెంట్ పరంగా ఛీ కొట్టించుకుంది. అసలు సినిమాలో నవ్వుకోవడానికి ఏమీ లేదని, ప్రేక్షకులను బలవంతంగా నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆడియన్స్ అన్నారు. కానీ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో ఎలా చేరిందో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. కబీర్ సింగ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ‘కబీర్ సింగ్’ సినిమా కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెటిజన్లు ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఓ ఉద్యమం జరిగిందనే చెప్పాలి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అగ్ర కథానాయిక సమంత కూడా మండిపడింది. 2019 మోస్ట్ ట్రోల్డ్ సినిమాల్లో ఇది ఐదో స్థానంలో నిలిచింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2pEXMwP

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk