బుధవారం సినీ ప్రముఖలు టార్గెట్‌గా ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. సినీ హీరోలు, నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచే దాడులు ప్రారంభించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ముందుగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇళ్లు కార్యాలయాలతో పాటు ఆయనకు చెందిన రామానాయుడు స్టూడియోస్‌లోనూ దాడులు జరిగాయి. అదే సమయంలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్, యంగ్ హీరో నానిల ఆఫీసుల్లోనూ దాడులు నిర్వహించారు. మరికొందరు సినీ ప్రముఖుల ఇళ్లు, నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో ఈ దాడులు జరిగాయి. అయితే ఇవి సాధారణ తనిఖీలు మాత్రమే అన్న టాక్ వినిపిస్తోంది. దాడులకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇంతవరకు బయటకు రాలేదు. Also Read: అయితే దాడులపై యువ నటుడు నవదీప్ ఆసక్తికరంగా స్పందించాడు. బుధవారం రాత్రి ట్విటర్‌లో నవదీప్ ఓ కామెంట్ చేశాడు. `ఒక వేళ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నా మీద దాడి చేస్తే,, వాళ్లే కొంత డబ్బును ఇక్కడ వదిలేసి వెళ్లిపోతారు` అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌తో పాటు బిల్ బ్యాండ్ బాజా (#billbandbaaja) అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేశాడు. ప్రస్తుత ఈ యువ నటుడు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవదీప్ తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదరుకావటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ఎప్పుడు వివాదాలతో వార్తల్లో ఉండే నవదీప్, ప్రస్తుతం సినీ రంగానికి సంబంధించి సీ స్పేస్ గ్లోబల్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35lbcx9
No comments:
Post a Comment