Saturday, 16 November 2019

మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు?.. వైరలవుతున్న అమల పోస్ట్‌

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, హీరో సతీమణి అమల.. సినిమాలకు దూరంగా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఇటీవల అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శర్వాకు తల్లిగా నటిస్తున్నారు అమల. Also Read: తల్లి పాత్రలో కనిపిస్తున్నా ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. శనివారం తన వర్క్‌అవుట్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు అమల. 71 కేజీల వెయిట్‌ను అమల ఎత్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో పాటు `ఈ రోజు 71 కేజీల వెయిట్‌ ఎత్తాను. మహిళలు బలంగా ఉడరని ఎవరన్నారు? స్ట్రాంగ్‌ బాడీ, స్ట్రాంగ్‌ మైండ్‌ అందరూ స్ట్రాంగ్‌గా ఉండండి` అంటూ కామెంట్‌ చేశారు. కింగ్‌ నాగార్జున ఇంట్లో అందరూ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. Also Read: గతంలో నాగార్జున తో పాటు నాగచైతన్య, అఖిల్‌, సమంతలు కూడా తమ వర్క్‌ వీడియోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల ఉత్సాహపరిచారు. అయితే అమల వర్క్‌ అవుట్‌ వీడియోను పోస్ట్ చేయటం మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం శర్వానంద్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమల, ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 లో రిలీజ్‌ అయిన హై ప్రీస్ట్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ksr5tF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....