Saturday, 23 November 2019

`త‌లైవి` ఫ‌స్ట్‌లుక్‌... అమ్మ పాత్రలో ఒదిగిపోయిన కంగ‌నా

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి, సినీ నటి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్రను ఆధారంగా రూపొందుతోన్న బయోగ్రాఫికల్‌ మూవీ `త‌లైవి`. ఈ సినిమాలో జయ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్(ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. Also Read: తాజాగా ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోన్న కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. జ‌య‌ల‌లిత ఓల్డ్ గెట‌ప్‌లో కంగ‌నా ర‌నౌత్ ఒదిగిపోయారు. అలాగే టీజ‌ర్‌లో జ‌య‌లలిత‌కు సంబంధించిన రెండు గెట‌ప్‌ల‌ను విడుద‌ల చేశారు. Also Read: అందులో ఇండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్ లుక్ ఒక‌టి కాగా.. త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పాత్రకు సంబంధించిన లుక్ మ‌రొక‌టి. ఏఎల్‌ విజ‌య్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35tqUX4

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk