Sunday 17 November 2019

‘వాడు నాకు మనవడేంటి.. జూనియర్ ఎన్టీఆర్‌కు అంత పెద్ద పదం వాడలేను’

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చేసిన తరవాత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌కు నారా లోకేశ్ బయపడుతున్నారని.. అందుకే, ఆయన్ని పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని వ్యాఖ్యానించారు. మళ్లీ ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ గాడిలో పడదని కూడా అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల మూలంగా ఇప్పుడంతా జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది. టీడీపీని మళ్లీ నిలబెట్టే సత్తా ఆయనకే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. టీవీ 9 న్యూస్ ఛానెల్‌లో ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ షోలో పాల్గొన్న లక్ష్మీపార్వతి పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో తన ఇద్దరు మనవళ్లు నారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రస్తావించారు. Also Read: అయితే, నారా లోకేశ్‌ను తన మనవడిగా లక్ష్మీపార్వతి అంగీకరించలేదు. ‘‘అతను మనవడేంటి నాకు? నా మీద అన్ని నిందలు వేయించినవాడు నాకు మనవడు ఎట్లా అవుతాడు? ఆ పదం వినడానికి బాధ కలుగుతోంది నాకు. ఇంత కన్నా దుర్మార్గం, నీచత్వం ఇంకేమీ లేదు. నీ తల్లి మీద వేయించుకో ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది. నేను ఎన్టీఆర్ భార్యని, గౌరవం ఉన్నటువంటి దానిని. అలాంటి నా మీద ఆ మూర్తిగాడిని పిలిచి ప్లాన్ చేస్తారా? ఇంతకంటే దిగజారిన రాజకీయం ఇంకొకటి ఉందా? అలాంటి వాడిని నేను మనవడు అని పిలవను. ఆ మాట అనుకోవడానికే పరమ అసహ్యంగా ఉంది నాకు’’ అంటూ లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. Also Read: మరో మనవడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాపాడగలుగుతాడు అని మీరు అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ.. ‘‘అతనికి కూడా ‘కాపాడతాడు’ అనే పెద్ద పదం వాడలేను. కాకపోతే లోకేశ్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్. 100 రెట్లు బెటర్. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించగలిగే నటనా చాతుర్యం ఉంది. అలాగే మంచి భాష మాట్లాడతాడు. మంచి వాక్ చాతుర్యం ఉంది. కనీసం సబ్జెక్టు మీద అతనికి కమాండ్ ఉంది. ఒక పర్ఫెక్ట్‌నెస్ ఉంది. ఇతనికి ఏదీ లేదు కదా. రాసిచ్చేది ఒకటి ఇతను చెప్పేది ఒకటి’’ అని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2qloP0z

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...