Thursday, 21 November 2019

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి జుట్టు సమస్యలు ఉండవు..

కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ సమస్య దూరం అవుతుంది. జుట్టు సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు కొన్ని చిట్కాలను పాటించాలి. మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటాం. ఆ పొరపాట్లలో సరిగ్గా తలస్నానం చేయకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటాయి. మరి అవేంటో తెలుసుకుని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.. చాలా మంది తలస్నానం వారానికి ఓ సారి చేస్తుంటారు. కానీ, ఇలా కాకుండా రెగ్యులర్‌గా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తల శుభ్రంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు దరిచి చేరవు. అదే విధంగా.. జుట్టు తడిగా ఉంటే త్వరగా ఆరాలని చాలా మంది డ్రయ్యర్స్‌ని ఉపయోగిస్తారు. కానీ, సాధ్యమైనంత వరకూ సహజంగానే జుట్టుని ఆరేలా చేసుకోవాలి. లేదా మెత్తని కాటన్, టర్కీ టవల్ ద్వారా జుట్టుని ఆరబెట్టుకోవాలి. కాసేపు టవల్ తలకు చుట్టి వదిలేయండి.. ఇలా చేయడం వల్ల జుట్టులోని తడిని టవల్ పీల్చుకుని పొడిగా అవుతుంది. కొంతమంది జుట్టు షైనింగ్‌గా ఉండాలని రకరకాల హెయిర్ స్ప్రేలు వాడతారు. దీని వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారతాయి. అంతేనా వెంట్రుకల చిట్లుతాయి కూడా. అందుకే అలాంటి హెయిర్ స్ప్రేలు వాడకపోవడమే మంచిది. అదే విధంగా వారానికి ఓసారి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి తలకి మర్దనా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనంగా ఫీల్ అవుతారు. జుట్టుకి కూడా పోషణ అందుతుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండాలి. వీటితో పాటు జుట్టుకి సహజ ప్యాక్స్ వేస్తుండాలి. అంటే హెన్నా, మెంతి ప్యాక్ వేస్తుండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా పెరుగుతుంది. కాంతివతంగా మారుతుంది. జుట్టుకి పెరుగు చక్కని పోషణనందిస్తుంది. ఏ ప్యాక్ వేసినా అందులో కాసింత పెరుగు కలపండి.. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో గుడ్డులోని తెల్లసొనని బాగా మిక్స్ చేయండి.. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకి పట్టించండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.. ఈ ప్యాక్ జుట్టుకి చక్కని పోషణనిస్తుంది. కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా దీనిని ట్రై చేయొచ్చు. అలోవేరాని గుజ్జుని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. అలోవెరాలో జుట్టు, చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలున్న కలబంద గుజ్జుని జుట్టు కుదుళ్లకి అప్లై చేయాలి ఓ అరగంట తర్వాత నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. చాలా మంది జుటు సమస్యలు తగ్గించుకునేకుందు కెమికల్స్‌తో కూడాన కాస్మెటిక్స్, క్రీమ్స్ వాడతారు. ఇవి తాత్కాలికంగా పనిచేసినా శాశ్వతంగా పరిష్కారం ఉండదు. కాబట్టి అలా కాకుండా సహజసిద్ధమైన చిట్కాలు పాటించండి. జుట్టు అనేది అందాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి జుట్టుని కాపాడుకునేందుకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టవు. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే డైట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ లేకున్నా జుట్టు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పోషణననిచ్చే ఆహారం తీసుకోవడం మరిచిపోద్దు. గుడ్లు, పాలు మీ డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోవద్దు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/348CYgn

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk