Thursday, 7 November 2019

సూపర్‌స్టార్ కోసం ఆ వరుడు ఏం చేశాడో తెలుసా?

ఈ ప్రపంచంలో మన జీవితాలకు మించిన ఇంపార్టెన్స్ దేనికీ ఇవ్వం. ముందు మన జీవితం.. ఆ తర్వాతే పక్కవారి గురించి ఆలోచించాలి. ఈరోజుల్లో ఈ సూక్తిని పాటించడమే ఉత్తమం. కానీ ఓ స్టార్ హీరో కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చేసుకున్నాడు ఓ అభిమాని. మలయాళ సూపర్‌స్టార్ నటించిన సినిమా ‘మమంగం’. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. అదే రోజున కేరళలోని పరవూర్ ప్రాంతానికి చెందిన సురేష్ అనే వ్యక్తికి నవంబ్ 21న పెళ్లి కుదిరింది. అయితే మమంగం సినిమాను అదే రోజున విడుదల చేస్తున్నాం అని సినిమా టీం ప్రకటించగానే సురేష్ కంగారుపడ్డాడు. ఎందుకంటే అతని పెళ్లి కూడా అదే రోజున. కాబట్టి సినిమాను చూడలేని పరిస్థితి. అదీకాకుండా సురేష్.. మమ్ముట్టికి వీరాభిమాని. అందుకే ఇరు వైపుల పెద్దల్ని ఒప్పించి పెళ్లి తేదీని మార్పించాడు. 21 కంటే ముందు ఏదన్నా మంచి ముహూర్తం ఉంటే చూడమన్నాడు. లేకపోతే మమంగం సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం కుదరదని సురేష్ బాధ. అలా సురేష్ అక్టోబర్ 30న పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యతో కలిసి మమంగం సినిమా చూడటానికి ముందుగానే అడ్వాన్స్డ్ టికెట్టు బుక్ చేసేసుకున్నాడు. ఇతను చేసిన పని తెలీడంతో స్థానిక మీడియా వర్గాలు సురేష్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాయి. తనకు మమ్ముట్టి అంటే ప్రాణమని, ఇప్పుటివరకు ఆయన చేసిన ఏ సినిమాను కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా మిస్ చేయలేదని తెలిపాడు. ఆయనపై తనకున్న అభిమాని తన పెళ్లి తేదీనే వాయిదా వేసుకునేలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. మమంగం సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. పద్మకుమార్ సినిమాను డైరెక్ట్ చేశారు. వేణు కున్నపిళ్లి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో మమ్ముట్టి లుక్ చాలా విభిన్నంగా ఉంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తెలుగు, హిందీ భాషల్లో తెలీదు కానీ తమిళం, మలయాళ ప్రాంతాల్లో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందని సినీ విశ్లేషకులు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NUs9ay

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....