Thursday, 21 November 2019

రేపు `జార్జ్‌ రెడ్డి` మళ్లీ పుడుతున్నాడు.. సమాధి వద్ద నివాళులర్పించిన చిత్రయూనిట్‌

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న వివాదాస్పద బయోగ్రాఫికల్‌ ఫిలిం జార్జ్‌ రెడ్డి. 1960, 70లలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దళం ఫేం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో వంగవీటి ఫేం నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జ్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ అంతా పాల్గొన్నారు. Also Read: ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ... రెండేళ్ల పాటు ఆయన చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను నిర్మించమన్నారు. సమాజం జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళను చాలామందిని కోల్పోయింది, ఎలా కోల్పోయామో, ఎందుకు కోల్పోయామో తెలిపేందుకే ఈ సినిమాని నిర్మించామన్నారు. జార్జి రెడ్డి వ్యక్తిత్వాన్నిను ప్రజలకు చేరవేసేందుకు ఓ ఛాలెంజ్‌గా తీసుకొని సినిమాను రూపొందించామన్నారు. 25 ఏళ్ళకే జార్జ్‌ రెడ్డి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. జార్జి రెడ్డి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను తెలుసుకోవడానికి, వీడియోలను సమకూర్చుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని, వాటి ఆధారంగానే ఈ సినిమాను తీశామని తెలిపారు. Also Read: ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్నాక ఐదేళ్లుగా ఏ సినిమాను చేయలేదని చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి అన్నారు. ఆయన నిజాయితీను చెప్పేందుకు ఈ సినిమా తెరకెక్కించామన్నారు. రేపు జార్జ్ రెడ్డి మళ్ళీ పడుతున్నాడని , ఆయన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన కోరారు. అయితే జార్జ్‌ రెడ్డి సినిమా ఓ వర్గాన్ని అవమానించేలా తెరకెక్కించారని కొంత మంది అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యగాం ఏబీవీపీ నాయకులు సినిమా రిలీజ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పటికే సెన్సార్‌ బోర్డ్‌ నుంచి యూఏ సర్టిఫికేట్‌ పొందిన జార్జ్‌ రెడ్డి సినమా రెడ్డి రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. రిలీజ్‌ కు ముందు ఎన్నో వివాదాలకు కారణమైన జార్జ్‌ రెడ్డి, రిలీజ్ తరువాత ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OwAUIl

No comments:

Post a Comment

'Nitishji Doesn't Need Certificate For His Politics'

'Muslims in Bihar under Nitishji's rule are safest than anywhere else.' from rediff Top Interviews https://ift.tt/Ct5Tbem