వివాదాస్పద దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం . ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. ముఖ్యంగా సినిమాలో చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌లను పోలిన పాత్రలు ఉండటంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది. అదే సమయంలో వర్మ తనదైన స్టైల్ వివాదాన్ని మరింత పెద్దది చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటిక రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఎన్ని వివాదాలు వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేసిన రామ్‌గోపాల్ వర్మ..కమ్మరాజ్యంలో కడప రెడ్లు విషయంలోనూ అదే పట్టుదలతో ఉన్నాడు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కుతోంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా వర్మ ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం స్పీడు పెంచాడు. Also Read: ఇప్పటికే పాటలు, ట్రైలర్లు రిలీజ్ చేసిన ఆర్జీవీ, పాత్రలకు సంబంధించిన స్టిల్స్‌ను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన కేఏ పాల్ పాటకు కూడా మంచి స్పందన రావటంతో వర్మ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అదే ఊపులో మరో ఆర్టిస్ట్ స్టిల్‌ను కూడా రిలీజ్ చేశాడు. `కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కొత్త నటుడు. ఎవరినో పొలినట్టుగా ఉన్నాడు. అతను నాకు తెలుసు కానీ గుర్తు రావటం లేదు. మీకు గుర్తు వస్తున్నాడా?` అంటూ తన ఫోటోలను ట్వీట్ చేశాడు వర్మ. Also Read: టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా వర్మతో పాటు సిద్దార్థ్ తాతోలు పేరు కూడా తెర మీద కనిపించనుంది. పెద్దగా గుర్తింపు ఉన్న నటులులెవ్వరు కనిపించికపోయినా ఒక్క జగన్ పాత్రకు మాత్రం రంగం ఫేం అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ముందు ముందు ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి. ఇటీవల జొన్నవిత్తుల వివాదం కారణంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు మరింత ప్రచారం లభించింది. సినిమా టైటిల్, ట్రైలర్‌పై జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తీవ్ర స్థాయిలో స్పందించటం, దానికి వర్మ వ్యక్తిగత దూషణలతో సమాధానం ఇవ్వటం, దానికి జొన్నవిత్తుల తిరిగి కౌంటర్ ఇవ్వటం ఇలా ఓ వారం రోజుల పాటు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై తీవ్ర చర్చ జరిగింది. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34yNmxx
No comments:
Post a Comment