డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్డ్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ . అంతకు ముందుకు రెండు మూడు హిందీ సినిమాల్లో నటించినా ఈ భామకు గుర్తింపు తీసుకువచ్చిన సినిమా మాత్రం హార్ట్ ఎటాకే. అయితే తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ తరువాత గ్లామర్ షోలో హద్దులు దాటేసింది. సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాలు వేడిపుట్టిస్తుంటాయి. అయితే ఎంత చేసినా అదాకు సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే ఆగిపోయింది. హీరోయిన్‌గా అదా శర్మకు ఒక్క సక్సెస్ కూడా లేదు. ఒక్క క్షణం సినిమా మాత్రం సక్సెస్ అయినా ఆ క్రెడిట్ అదాకు దక్కలేదు. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలు సక్సెస్ అయిన ఈ సినిమాలో అదాది సెకండ్ హీరోయిన్ పాత్రే. తెలుగులో ఆశించిన సక్సెస్‌లు దక్కకపోయినా బాలీవుడ్ మాత్రం బాగానే ఆదుకుంది. Also Read: హిందీలో అదా శర్మ నటించిన కమాండో సిరీస్ మంచి విజయం సాధించింది. విద్యుత్ జమ్వాల్ హీరోగా తెరకెక్కిన ఈ సిరీస్‌లోని మూడో భాగం నవంబర్ 29న ప్రేక్షకుల ముందకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. తన వంతుగా అదా కూడా ప్రమోషన్‌లో భాగం పంచుకుంటుంది. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్‌తో పాటు అదా కూడా పలు యాక్షన్ సీన్స్‌లో నటించింది. అందుకోసం కర్రసాము కూడా చేసింది. తాజాగా తాను కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది అదా. అంతేకాదు ఆ వీడియోతో పాటు `ఎవరికైనా దేశీ బాడీగార్డ్ కావాలా? అయితే రిజిస్టర్ చేసుకోండి. నేను నవంబర్ 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాను. తరువాత రిలీజ్. భావన రెడ్డి బిజీ అవుతుంది. ఇది ఇండియన్ మార్షల్ ఆర్ట్ సిలంబం` అంటూ ట్వీ్ట్ చేసింది అదా. Also Read: త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కమాండో 3తో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది అదా. నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి బైపాస్ రోడ్, అబిర్ సేన్‌గుప్తాతో కలిసి మాన్ టు మాన్ సినిమాల్లో నటిస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్న తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అభిమానులకు కనువిందు చేస్తూ మరింత బిజీగా ఉంది ఆ బ్యూటీ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ct6wsZ
No comments:
Post a Comment