Wednesday, 13 November 2019

మాస్‌ మహరాజ్‌ సినిమాకు మెగా ప్రొడ్యూసర్‌ క్లాప్‌

మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ 66వ చిత్రానికి `క్రాక్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గురువారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా ఘ‌నంగా ప్రారంభ‌మైంది. స‌రస్వతి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మాత‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కనుంది. యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్‌.వి.ప్రసాద్‌, సురేంద‌ర్ రెడ్డి, రాఘ‌వేంద్రరావు, అల్లు అర‌వింద్‌, సుధాక‌ర్ రెడ్డి, న‌వీన్ ఎర్నేని, ప‌రుచూరి బ్రద‌ర్స్‌, దాము, బీవీఎస్ఎన్ ప్రసాద్‌, రామ్ తాళ్లూరి లతో పాటు పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తొలి స‌న్నివేశానికి మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్టగా, ప‌రుచూరి వెంక‌టేశ్వర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. Also Read: ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు తొలి షాట్‌కు గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. దిల్‌రాజు, సురేంద‌ర్ రెడ్డిలు దర్శకుడు స్క్రిప్ట్‌ను అందించారు `డాన్‌శీను`, `బ‌లుపు` లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్‌. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. సినిమాలో ర‌వితేజ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో హింట్‌ ఇచ్చేలా టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు చిత్రయూనిట్. సినిమా క్యారెక్టర్ ప‌రంగా ర‌వితేజ గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో ఉన్న డిఫ‌రెంట్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. Also Read: ఓపెనింగ్‌ సంద‌ర్భంగా దర్శకుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ - `మా `క్రాక్‌` మూవీ ఓపెనింగ్‌కి వ‌చ్చిన అతిథులంద‌రికీ థ్యాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించే ఇన్‌టెన్స్ క‌థ‌. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వ‌చ్చే ఏడాది స‌మ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అన్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్రఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్రల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `మెర్సల్‌`, `బిగిల్‌` వంటి చిత్రాల‌కు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QhACaU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....