Tuesday 19 November 2019

పొట్టోడు పార్టీని లాగేసుకుంటే.. బాబును మరింత భయపెడుతున్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తు్న్న ఈ సినిమాతో రాజకీయా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు వర్మ. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌లో సినిమా మీద అంచనాలు పెంచిన ఆర్జీవి తాజాగా మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్‌లో మరింత ఆసక్తికర డైలాగ్స్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశాడు. ఓడిపోయిన పార్టీలోని తండ్రీ కొడుకులు బాధలో ఉండగా పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఐదేళ్లు పార్టీని నడపటం కష్టమే అంటూ కామెంట్‌ చేస్తాడు. దానికి మరో వ్యక్తి ` లోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే` అంటాడు. అయితే వర్మ పొట్టోడు ఎవరన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్ అరెస్ట్, ఆంధ్ర ప్రదేశ్ సీఎం రాజీనామా లాంటి ఆసక్తికర అంశాలతో ఈ ట్రైలర్‌ను రూపొందించాడు వర్మ. Also Read: ప్రస్తుతం రాజకీయాల్లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ బాబు, కేఏపాల్‌ లాంటి వ్యక్తిలను పోలిన పాత్రలో వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే వర్మ మాత్రం తన సినిమాలోని పాత్రలన్ని కేవలం కల్పితాలు మాత్రమే ఎవరితో అయినా పోలికలు కలిస్తే అది యాధృచ్చికమే అంటున్నాడు. ఇప్పటికే టైటిల్‌ సాంగ్‌, పప్పు లాంటి అబ్బాయి సాంగ్స్‌తో సినిమా మీద కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వర్మ, నవంబర్‌ 29న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ సంస్థలు రూపొందించిన ఈ సినిమాను సిద్దార్థ్ తాతోలుతో కలిసి డైరెక్ట్ చేస్తున్నాడు వర్మ. Also Read: వర్మ గత చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా కావాల్సినంత కాంట్రవర్సీలతో సినిమా మీద అంచనాలను రోజు రోజుకు పెంచేస్తున్నాడు వర్మ. ఈ సినిమా తరువాత హైదరాబాద్‌లో 80లలో గొడవలకు కారణమైన దాదా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నాడు ప్రకటించాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/341RAhm

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...