Saturday 16 November 2019

హీరోగా మారిన రామ్‌ చరణ్‌ విలన్‌

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా భాస్కర్‌ ఒరు రాస్కెల్‌. ఈ సినిమాలో సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ముఖ్య పాత్రలో నటించింది. సిద్ధికీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ సినిమాను ఇప్పడు తెలుగులో ‘భాస్కర్ ఒక రాస్కెల్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మాత పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ.. `తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు. వారు అలా కలిసేందుకు వారి ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారు అన్న ఆసక్తికరమైన పాయింట్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. అయితే కథలో ఓ ట్విస్ట్‌ ఆసక్తికలిగిస్తుంది. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో సూపర్బ్‌గా నటించారు. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం అందరినీ అలరిస్తుంది. నవంబర్ నెలాఖరులో సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము.` అన్నారు. Also Read: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. `తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో మంచి పేరున్న సిద్దికీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ రెండు భాషలలో వేరు వేరుగా సిద్దికీ తీసిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. యాక్షన్, సెంటిమెంట్ వంటి అన్ని అంశాలతో చక్కటి కుటుంబ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను`. అని అన్నారు. టాలీవుడ్‌ నిర్మాత కె.యల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. `ప్రస్తుతం మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆ కోవలో కుటుంబ కథా నేపథ్యంలో తీసిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న ఆశిస్తున్నా. నూతన నిర్మాతలకు చిత్ర నిర్మాణం పట్ల అవగాహన కల్పించడం కోసం నిర్మాతల మండలి తరపున క్లాసులు నిర్వహిస్తున్నాం. దీనిని నూతన నిర్మాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను` అన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OkKM7V

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...