Sunday 24 November 2019

తమన్‌కు సాయి తేజ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇదో వెరైటీ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్!

మనకు వినిపించే ప్రతి శబ్దంలోనూ సంగీతం దాగి ఉంటుంది. కాకపోతే, ఆ శబ్ధాన్ని సప్త స్వరాలైన ‘‘స రి గ మ ప ద ని’’ ఆధారంగా సరైన క్రమంలో మళిచినప్పుడు మాత్రమే వినసొంపైన సంగీతం వస్తుంది. ఈ సంగీతాన్ని వినిపించడానికి ఎన్నో రకాలైన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఘటం, హార్మోనియం, డప్పు, డోలక్ ఇవే మన సంగీత పరికరాలు. కానీ, కాలంతో పాటు సంగీతంలో రకరకాల మార్పులు వచ్చాయి. కొత్త కొత్త సంగీత పరికరాలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం సినిమా రంగంలో సంగీత దర్శకులు ఎన్నో కొత్తరకం ఇన్‌స్ట్రుమెంట్లు వాడుతున్నారు. చాలా వరకు అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలే. ఎలక్ట్రానిక్ కీబోర్డ్, ఎలక్ట్రిక్ గిటార్, రిథమ్ ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్లూట్.. ఇలా చాలా రకాలున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ లాంటి సంగీత దర్శకులైతే ప్రపంచ వ్యాప్తంగా జల్లెడ పట్టి మరీ కొత్తరకం పరికరాలు తీసుకొస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఒక కొత్త మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. దాని పేరు పెర్ల్ మాలెట్‌స్టేషన్. దీనిపై ఎలాంటి సౌండ్‌ అయినా వచ్చేస్తుంది. కీబోర్డ్, డ్రమ్స్ ఇలా రకరకాల సౌండ్స్ దీనిపై వాయించొచ్చు. ఇలాంటి విచిత్రమైన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్‌కు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకో బిగ్ సర్‌ప్రైజ్. ఈయన నిజంగానే ప్రతిరోజూ పండగే చేశారు. హృదయాన్ని హత్తుకునే చాలా గొప్ప వ్యక్తి. మేం విజయం సాధించాలని చాలా గట్టిగా ప్రార్థిస్తా’’ అని తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌కు ఇప్పుడుప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇటీవల ఎ.ఆర్.రెహమాన్ తన కుమారుడు ఎ.ఆర్.అమీన్‌తో ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ను ప్లే చేయించారు. ఇద్దరూ కలిసి మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన వీడియో ఒకటి ఆయన యూట్యూబ్‌లో పెట్టారు. నిజంగా ఇదో గొప్ప మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్. చాలా శబ్దాలు దీనిలో సులభంగా పలుకుతాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం అందిస్తు్న్నాం. ఈ వీడియోలు చూస్తే పెర్ల్ మాలెట్‌స్టేషన్‌పై మీకు ఒక అవగాహన వస్తుంది. ఇంతకీ దీని ధర సుమారు రూ.82 వేలు. పెర్ల్ మాలెట్‌స్టేషన్‌ను వాయిస్తోన్న ఎ.ఆర్.అమీన్ పెర్ల్ మాలెట్‌స్టేషన్ రివ్యూ


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35suuRo

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...