Wednesday, 6 November 2019

Bigil నటిని పెళ్లిచేసుకుంటామంటున్న హీరోయిన్స్

ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్ నటించిన ‘బిజిల్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించారు. ఇందులో విజయ్ ఫుల్‌బాల్ కోచ్‌గా వ్యవహరించారు. ప్రముఖ నటి ఇందులో క్రీడాకారిణిగా నటించారు. అయితే ఇప్పుడు ఇందూజను పెళ్లి చేసుకుంటామంటూ ఎగబడుతున్నారు హీరోయిన్లు. ఇటీవల ఇందూజ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫొటో చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ ఫొటోకు లక్ష 73 వేల మందికి పైగా లైక్ చేశారు. అయితే.. ఈ ఫొటోను చూసి ఫిదా అయిన మహిమ నంబియార్ అనే నటి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఇందూజను ప్రశ్నించారు. ఇందుకు ఇందూజ వెంటనే స్పందిస్తూ.. ‘వచ్చేయ్ ఇప్పుడే పెళ్లి చేసేసుకుందాం మై లవ్’ అన్నారు. ఇందూజ, మహిళ కలిసి ‘మహాముని’ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయతే ఈ డిస్కషన్ ఇక్కడితో ఆగలేదు. వీరిద్దరి చాటింగ్ చూసి మరో హీరోయిన్ తోడైంది. ఆమే ప్రముఖ నటి అతుల్యా రవి. ‘నేను కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నాను’ అని కామెంట్ చేశారు. దాంతో మహిళ రిప్లూ ఇస్తూ.. ‘ఓకే అతుల్య. ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో ఇందూజ నిర్ణయానికే వదిలేద్దాం. ఒకవేళ తను నో చెబితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని సరదాగా కామెంట్ చేశారు. వీరి ముగ్గురి చాటింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయింది. నెటిజన్లైతే కామెంట్లతో పండగ చేసుకున్నారు. ‘మీరు మీరు పెళ్లిళ్లు చేసుకుంటే ఇక మా అబ్బాయిలు ఎందుకు’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బిజిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల చేత ‘విజిల్’ వేయించింది. బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. ఏ.ఆర్ రెహమాన్ సినిమాకు మ్యూజిక్ అందించారు. హిందీలో షారుక్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను డైరెక్ట్ చేశారు అట్లీ. ఈ సినిమాకు షారుక్ కూడా ఫిదా అయిపోయారు. త్వరలో అట్లీ, షారుక్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2rgG6rL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....