Wednesday, 6 November 2019

హ్యాపీ బర్త్‌డే Anushka: అందాల బొమ్మ.. అయ్యింది తెలుగు ప్రేక్షకులకు జేజమ్మ

అది 2005.. అప్పటికే ఇండ‌స్ట్రీలో ఆర్తి అగ‌ర్వాల్, త్రిష‌, శ్రియ లాంటి హీరోయిన్లు చ‌క్రం తిప్పుతున్నారు. కొత్త వాళ్లు వ‌చ్చినా అంత ఈజీగా కుదురుకునే రోజులు కావ‌వి. అలాంటి సమయంలో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఓ మెరుపుతీగ.. ఆమె పేరు . అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సూప‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు అనుష్క. ఆ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకున్నారు. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూగా నామినేట్ అయ్యారు అనుష్క. ఆ వెంటనే అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ సరసన ‘మ‌హానంది’ సినిమాలో న‌టించారు. ఇక 2006లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘విక్రమార్కుడు’తో అనుష్క జాతకం మారిపోయింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్టర్ కావ‌డం.. అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం వెంటవెంటనే జ‌రిగిపోయాయి. Also Read: ‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత అనుష్కకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత 2009లో అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ ఏడాది కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధ‌తి’తో జేజమ్మగా మారిపోయారు అనుష్క. అంతేకాదు, తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయారు. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్, సినీ మా అవార్డ్, సంతోషం అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘వేదం’ సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసారు ఈమె. ‘సింగం’, ‘మిర్చి’, ‘సింగం 2’, ‘బాహుబలి’ లాంటి ఎన్నో సినిమాలతో తిరుగులేని హీరోయిన్ అయిపోయారు అనుష్క. 14 ఏళ్ల కెరీర్‌లో ఒక్కసారి కూడా అవ‌కాశాల కోసం ఇబ్బందిప‌డిన సంద‌ర్భాలు అనుష్కకు రాలేదు. అంతగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈ దశాబ్ద కాలంలో దక్షిణాది ఇండస్ట్రీలో మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి కాదు. Also Read: వ‌ర‌స సినిమాలు చేస్తూ సౌత్ ఇండ‌స్ట్రీలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు అనుష్క. తెలుగులో ఎన్నో సంచ‌ల‌న సినిమాల్లో న‌టించిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన చిత్రాల్లో ‘పంచాక్షరి’ నిరాశ పరిచినా ‘రుద్రమ‌దేవి’, ‘భాగ‌మ‌తి’ లాంటి సినిమాలు ఆమె స్థాయికి నిదర్శనాలు. ‘రుద్రమదేవి’ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌తో పాటు సైమా అవార్డును సొంతం చేసుకున్నారు అనుష్క. ఇక ‘బాహుబలి’ సినిమా ఈమె కెరీర్‌లో కలుకితురాయి. దేవసేన పాత్రకు ప్రాణం పోసిన తీరు అద్భుతమే. బాహుబలి, భల్లాలదేవుడి పాత్రలకు ఎంత పేరొచ్చిందో.. వాళ్లతో సమానంగా తన నటనకు మార్కులు వేయించుకున్నారు అనుష్క. ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనుష్క శెట్టి. ఈమె ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని.. ఇలాగే సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉండాలని ఆశిద్దాం. నేడు పుట్టినరోజు జరుపుకుంటోన్న అనుష్కకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NO4VTK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....