Monday, 4 November 2019

సెన్సార్‌ పూర్తిచేసుకున్న `తిప్పరా మీసం`, నవంబర్‌ 8న రిలీజ్‌

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కృష్ణ విజయ్‌ ఎల్‌ దర్శకత్వంలో అనే టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో డిఫరెంట్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. శ్రీ విష్ణు సరసన నిక్కీ తంబోలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి దర్శకుడు కృష్ణ విజయ్‌ ఎల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. Also Read: ఇటీవల సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హీరో నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం యల్ కుమార్ చౌదరి, తిప్పరా మీసం టీం హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, నటుడు బెనర్జీ, నటి రోహిణి, రవిప్రకాష్, రవివర్మ , కమేడియన్ నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా తొలి టిక్కెట్ ని వినాయక్, రోహిత్ కొనుగోలు చేశారు. Also Read: ఈ కార్యక్రమంలో వినాయక్‌ మాట్లాడుతూ.. `శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఆ కథల్లో ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు. బ్రోచేవారేవారురా సినిమాని మూడుసార్లు చూశాను. నాకు బాగా నచ్చింది. ఆడియెన్స్ లో, సినిమా ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు విష్ణు. ఇక ముందుకుడా ఇలాగే మంచి సినిమాలు చెయ్యాలి. ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మంచి లాభాలతో పాటు పేరు తీసుకురావాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్` అన్నారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ..`ఆల్మోస్ట్ ఈ టీమ్ అందరితో వర్క్ చేశాను. సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. వండ్రఫుల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చెయ్యాలి. విజయ్ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతాడు. విజయ్‌తో నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా చేయబోతున్నాను` అన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36AB61B

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....