Sunday, 21 July 2019

దేశంలోని ప్రతి ఇంటికి నువ్వు కూతురివే.. రన్నర్ హిమ దాస్‌కు తేజూ ప్రశంస

భారత స్ప్రింటర్ కేవలం 20 రోజుల్లో ఐదు బంగారు పతకాలు సాధించి దేశం గర్వించేలా సత్తా చాటింది. యూరప్‌లో ఈనెల 2న తొలి బంగార పతకాన్ని సాధించిన హిమ దాస్ అక్కడి నుంచి వరసపెట్టి ఐదు బంగారు పతకాలు గెలుచుకుంది. మొదటిగా జులై 2న పోలాండ్‌లో పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో పాల్గొన్న హిమ దాస్ 200 మీటర్ల రేస్‌లో బంగారు పతాకం సాధించింది. ఆ తరవాత జులై 7న పోలాండ్‌లోనే కుట్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో అగ్రస్థానంలో నిలిచి రెండో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. జులై 13న చెక్ రిపబ్లిక్‌లో క్లాడ్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో మూడో బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. ఆ దేశంలోనే 17వ తేదీన జరిగిన టాబర్ అథ్లెటిక్స్ మీట్‌లో నాలుగో బంగారు పతకం సొంతం చేసుకుంది. అక్కడే జరిగిన 400 మీటర్ల రేస్‌లో అస్సాంకు చెందిన ఈ 19 ఏళ్ల రన్నర్ ఐదో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. ఇలా కేవలం 20 రోజుల్లోనే ఐదు బంగారు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని చాటింది. ప్రస్తుతం హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశంలోని క్రీడాకారులకు హిమ దాస్ స్ఫూర్తి అంటూ సినీ, క్రీడా ప్రముఖులు కొనియాడుతున్నారు. హిమ దాస్ ‘బంగారు’ ప్రదర్శనపై టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. తనను చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారని ట్వీట్ చేశారు. ‘నువ్వు ఇలాగే దూసుకుపో అమ్మాయి!!!! దేశంలో ఉన్న ప్రతి ఇంటికి ఇప్పుడు నువ్వు కూతురువి. 1.3 బిలియన్ల ప్రజలను గర్వపడేలా చేశావు హిమ దాస్’ అని తన ట్వీట్‌లో తేజూ పేర్కొన్నారు. ఒక్క తేజూనే కాదు.. బాలీవుడ్ నటుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ కూడా హిమ దాస్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. ‘ఈ విజయం మీకు స్ఫూర్తినివ్వకపోతే ఇంకేమిస్తుంది???? 20 రోజుల్లో ఐదో బంగారు పతకం!!! నువ్వు అసలు సిసలైన సూపర్ స్టార్ హిమ దాస్. నిజంగా భారత్ గర్వపడేలా చేశావు. అభినందనలు’ అని రితేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SsEVPy

Jabardasth Vinodini: నిన్న చంపబోయారు.. ఈరోజు నీళ్లు ఆపేశారు: జబర్దస్త్ వినోదిని ఆవేదన

ఇంటి ఓనర్ దాడితో తీవ్రంగా గాయపడ్డ జబర్దస్త్ కమెడియన్ వినోద్‌ (వినోదిని) తనకు ప్రాణహాని ఉందంటున్నాడు. ఓ ఇల్లు కొనుగోలు వ్యవహారంలో తనను పిలిపించి హత్నాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన వినోద్ తీవ్రగాయాలపాలైన విషయం తెలిసిందే. కాగా నిన్న తనను చంపేందుకు ప్రయత్నించి.. ఈరోజు తన ఇంటికి నీళ్లు రాకుండా ఆపేశారని ఆవేదన చెందారు వినోద్. ఈ సందర్భంగా ఈ గొడవకు గల కారణాన్ని వివరించారు. ‘నేను ఇంటి కోసం మార్చి 16న ఓనర్స్‌కి రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. మేం అడ్వాన్స్ ఇచ్చిన తరువాత ఇంటిని రెండుగా డివైడ్ చేయడానికి కనస్ట్రక్ట్ చేయాలి. కాని నెలన్నరైనా ఇంటిని ఖాళీ చేయలేదు. మేం చెప్పగా చెప్పగా చివరికి ఇంటిని ఖాళీ చేయించారు. తీరా ఇంటి పని మొదలు పెట్టాక.. ఇంటిని సమానంగా కొలవలేదు. వాళ్లకంటే మా స్థలం తక్కువగా ఉంది. తక్కువగా ఉందని అడిగితే.. మేం ఇంతే ఇస్తాం అని తిరగబడ్డారు. కొన్నాళైన తరువాత ఇక ఇంటిని ఇవ్వము.. డబ్బులు కూడా ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నన్ను హెచ్చరించారు. దీంతో నేను ఈ ఏరియా కార్పొరేటర్ దగ్గరకు వెళ్లాను. ఆయన వీళ్లను పలిపించి మందలించారు. వాళ్లకు ఇళ్లు అయినా ఇవ్వండి లేకుంటే డాక్యుమెంట్స్‌లో ఉన్నట్టుగా రూ. 10 లక్షలు ఇచ్చారు కాబట్టి రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చేయమని చెప్పారు. అమ్ముతానని డబ్బు తీసుకుని ఇప్పుడు అమ్మనని చెప్పడం తప్పు అని వాళ్లని మందలించారు. దీంతో వాళ్లు నన్ను మాట్లాడదాం అని పిలిచి మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంటి ఓనర్ ప్రమీల, భర్త బాలాజీ, పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, చిన్న కొడుకు అభిషేక్, పెద్ద కోడలు సంధ్య నన్ను కొట్టారు. బాలాజీ నన్ను కొట్టి చంపబోయాడు. నాలుక తెగేలా కొట్టారు. పీక నొక్కి చంపబోయారు. నా డబ్బులు తీసుకుని మోసం చేసిందే కాకుండా నాపై హత్యాయత్నం చేశారు. ఈరోజు మా ఇంటికి వాటర్ కూడా రాకుండా నీటిని బంద్ చేశారు. మమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు జబర్దస్త్ వినోదిని. కాగా వినోదిని పై దాడి చేసిన ఇంటి ఓనర్‌పై కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M4qfoS

కాజల్ చర్మ సౌందర్యానికి కారణం ఇదా..!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై బ్యూటీ.. కృష్ణవంశీ ‘చందమామ’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ ‘చందమామ’గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరితోనూ వరసపెట్టి సినిమాలు చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు 12 ఏళ్లు గడిచినా ఇంకా తన ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉంది. తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే, తన చర్మ సౌందర్యం వెనకున్న రహస్యం గురించి తాజాగా కాజల్ వెల్లడించింది. తన చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఒక న్యూట్రిషనల్ ప్రొడక్ట్ కారణమంటోంది. ఈ మేరకు ఆ న్యూట్రిషన్ సంస్థ ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాజల్ చెప్పుకొచ్చింది. ‘ఐదేళ్ల క్రితం, నా ఫ్రెండ్ ఒకరు నన్నొక మాట అడిగారు. ఆరోగ్యవంతమైన చర్మం కోసం న్యూట్రిషన్ ప్రొడక్ట్‌ను ట్రై చేయాలని నేను అనుకుంటే గనుక, ఆయన స్టార్టప్ దీనిపైనే పనిచేస్తుందని, దాన్ని వాడి ఎలా ఉందో చెప్పాలని కోరారు. అప్పటి నుంచి నా దినచర్యలో ఇది స్థిరంగా ఉండిపోయింది. న్యూట్రోవా సాధించిన క్లినికల్ స్టడీ ఫలితాలకు అభినందనలు. 2014 నుంచి నా చర్మ సౌందర్యాన్ని ఇది మాత్రమే కాపాడింది. మీరూ కొనండి’ అని కాజల్ పేర్కొంది. వాస్తవానికి ఇది న్యూట్రోవా ప్రచారంలో భాగంగా కాజల్ చేసిన పోస్ట్. కానీ, ఇదే కాజల్ చర్మ సౌందర్యానికి కారణమట.. నిజమేనా!!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LZyCSx

బర్త్ డే పార్టీలో ప్రియాంక స్మోకింగ్.. అబద్ధాలకోరు అంటూ ట్రోలింగ్!

బాలీవుడ్ నటి వయసు ఇంకో సంవత్సరం పెరిగింది. జులై 18న ఆమె 37వ ఏట అడుగుపెట్టింది. తన పుట్టినరోజు వేడుకలను అమెరికాలోని మియామి నగరంలో జరుపుకుంది. మియామిలోని సముద్రంలో యాచ్‌(పడవ)పై ఆమె పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకల్లో భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా, ఇతర సన్నిహితులతో కలిసి ప్రియాంక ఎంజాయ్ చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, వీటిలో ఒక ఫొటో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రోలింగ్‌కు దారితీసింది. ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా సిగరెట్ కాల్చుతోంది. ఆమెతోపాటు భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా సిగార్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రియాంకను ఒక ఆటాడుకుంటున్నారు. దీనికీ కారణాలున్నాయి..!! కిందటేడాది ప్రియాంక ఒక అద్భుతమైన సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చింది. దీపావళి నాడు టపాసులు కాల్చవద్దని ప్రజలను కోరింది. ఈ పండుగ మన జీవితాల్లో వెలుగులను నింపుతుందని.. లడ్డూలు, ప్రేమను పంచుతుందని.. అంతేకానీ, కాలుష్యాన్ని కాదని హితబోధ చేసింది. దీన్ని పట్టుకుని ఇప్పుడు నెటిజన్లు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాలుష్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు, ఆస్తమాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కిందటేడాది ప్రియాంక నడుం బిగించింది. ఆస్తమాపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రచారం చేసింది. దీనిలో భాగంగా తనకు 5 ఏళ్ల వయసులోనే ఆస్తమా వచ్చిందని ప్రియాంక చెప్పింది. అయినప్పటికీ, తాను వెనకడుగు వేయకుండా ఈ స్థాయికి ఎదిగానంటూ స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పింది. ఆ మాటలను ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ప్రియాంక అబద్ధాలకోరు అంటూ తిట్టిపోస్తున్నారు. ఆస్తమా ఉంటే సిగరెట్ ఎలా తాగుతున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, స్మోకింగ్ అంటే తనకు గిట్టదని, యాక్ అని 2010లో ప్రియాంక చేసిన ట్వీట్‌ను ఇప్పుడు మళ్లీ బయటికి తీశారు. మొత్తానికి ప్రియాంక అడ్డంగా దొరికిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sx3FWT

‘వెయిటింగ్ ఓవర్ నాన్నా.. థాంక్యూ రా చైతూ’: నాగ్‌కి చైతూ వెల్కమ్

మరికొన్ని గంటల్లో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ 3 బుల్లి తెరపై సందడి చేయనుంది. కింగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్.. నేటి (జూలై) రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇక ఈ షో ప్రసారానికి ముందే వివాదాలు చుట్టేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ షో అంటే వివాదం.. వివాదమే ఈ షోకి పెట్టుబడి అన్నట్టుగా ప్రసారానికి ముందే బిగ్ బాస్‌ను వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక వైపు బిగ్ బాస్ ఆడిషన్స్ కంప్లీట్ చేసి చివరి క్షణంలో దగాపడ్డ కంటెస్టెంట్స్ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తాలు ఢిల్లీ స్థాయిలో బిగ్ బాస్‌ను ప్రసారం కాకుండా అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే వీరికి న్యాయం జరుగుతుందా? బిగ్ బాస్ యాజమాన్యం స్పందిస్తుందా? లాంటి విషయాలను పక్కన పెడితే.. ఈ ఇద్దరు కాంట్రివర్శి సెలబ్రిటీల ద్వారా బిగ్ బాస్‌కు విపరీతమైన హైప్ వచ్చేసింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తరువాత ఆ స్థాయిలో కాంట్రివర్శి పర్శనాలిటీస్‌గా ఉన్న శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తాలు బిగ్ బాస్‌పై యుద్ధం ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనేవారు లేకపోలేదు. వ్యూహం ఏదైనా మొత్తానికికైతే ఈ ఇద్దరి వల్ల బిగ్ బాస్‌కి మోయలేనంత ప్రీ పబ్లిసిటీ వచ్చేసింది. కొన్ని కోట్ల ఖర్చు పెట్టిన ఈ రేంజ్‌లో పబ్లిసిటీ రాదనేది వాస్తవం. ఇదిలా ఉంటే.. అనేవి వివాదాలు, విమర్శలు, ధర్నాలు, అరెస్టులతో నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం నేటి రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు చేసే హంగామా అంతా బిగ్ బాస్‌కి చూపిస్తున్నారు నాగార్జున అభిమానులు. ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ ‘బాస్’ నాగార్జునకి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ట్వీట్‌ల మోత మోగిస్తుండగా.. నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య సైతం ట్వీట్ వదిలారు. ‘వెయిటింగ్‌ ఓవర్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వచ్చేసింది’.. అంటూ ట్వీట్ చేశారు. దీనిపై బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున స్పందిస్తూ.. ‘థాంక్స్ రా’ అని రిప్లై ఇచ్చారు. కాగా.. నేటి రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2y1EKRQ

Saturday, 20 July 2019

Every MCU Phase 4 Movie, Series Marvel Announced at Comic-Con

Phase 4 of the Marvel Cinematic Universe is official. At San Diego Comic-Con 2019 on Saturday, Marvel Studios president Kevin Feige announced 10 films and TV shows, including Black Widow, Eternals,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2GjWIDC

Marvel's What If...? Reveals Extended MCU Voice Cast, Out Summer 2021 on Disney+

Marvel's What If...?, the first animated series in the Marvel Cinematic Universe, has cast Jeffrey Wright as The Watcher. Over a dozen MCU stars from Avengers, Guardians of the Galaxy, Captain...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Sxt8Q3

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....