Saturday, 2 November 2019

అఫీషియల్‌.. రీమేక్‌తో పవర్‌ స్టార్‌ Pawan Kalyan రీ ఎంట్రీ

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. పవన్‌ సినిమా వేడులకలోనే కాదు ఇతర హీరోల సినిమా వేడుకల్లోనూ పవర్‌ స్టార్‌ అన్న నినాదాలు వినిపిస్తుంటాయి. ఇక మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల వేడుకల్లో అయితే ఈ మేనియా తారా స్థాయిలో ఉంటుంది. అయితే పవన్‌ పొలిటికల్‌ ఎంట్రీతో కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. ఒక దశలో పవన్‌ ఇక సినిమాలు చేయడన్న ప్రచారం కూడా జరిగింది. పవన్‌ మాత్రం సినిమాల్లో కొనసాగుతానని గానీ.. ఇక సినిమాలు చేయనని గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో పవన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పాడంటూ వస్తున్న వార్తలను కూడా ఖండించలేదు. దీంతో పవన్‌ ఇక సినిమాలను చేయరని భావించారు అంతా. Also Read: అయితే ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితి మారిపోయింది. పవన్‌ పొలిటికల్‌ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవటంతో ఇక వెండితెరపై రీ ఎంట్రీ ఖాయం అన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో రామ్‌ చరణ్‌ లూసిఫర్‌ సినిమా రీమేక్‌ హక్కులు తీసుకోవటంతో ఈ రీమేక్‌తో పవన్‌ రీఎంట్రీ అని ఫిక్స్‌ అయ్యారు అంతా. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా పవన్‌ రీ ఎంట్రీని కన్‌ఫర్మ్‌ చేస్తూ ప్రముఖ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీ్ట్‌ చేశారు. పవన్‌ రీ ఎంట్రీ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన పింక్‌ రీమేక్‌ను పవన్‌ ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను కోలీవుడ్‌లో అజిత్ హీరోగా రీమేక్‌ చేసి సక్సెస్‌ అయిన బోనీ కపూర్‌ తెలుగు వర్షన్‌ కూడా నిర్మించనున్నాడు. Also Read: వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై పవన్‌ పీఆర్‌టీం గానీ, నిర్మాతలు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పవన్‌ చివరగా 2018లో రిలీజ్‌ అయిన అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌ కావటంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అప్పటి నుంచి ఓ సూపర్‌ హిట్ తో పవన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌. మరి అయిన ఆ కోరిక తీరుస్తుందేమో చూడాలి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2r8eo0v

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw