Friday, 22 November 2019

నాగ చైతన్య బర్త్‌డే స్పెషల్.. NC19 వీడియో టీజర్‌

మజిలీ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం మరో ఎమోషనల్‌ డ్రామాలో నటిస్తున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు నాగచైతన్య. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు నాగచైతన్యకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. శనివారం చైతూ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్‌ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంకా పేరు నిర్ణయించిన ఈ సినిమాను ప్రస్తుతం ఎన్‌సీ 19గా వ్యవహరిస్తున్నారు. ద వరల్డ్‌ ఆఫ్‌ ఎన్‌సీ 19పేరుతో రిలీజ్‌ చేసిన ఈ టీజర్‌లో సినిమాలో చైతూ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో రివీల్‌ చేశారు. మాస్‌ లుక్‌లో కనిపిస్తున్న చైతూను పెదవాడిగా పరిచయం చేశారు. Also Read: పిల్లలతో కలిసి ఆనందంగా ఎంజాయ్‌చేస్తున్న సీన్‌తో పాట ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకున్న సీన్స్‌తో టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ దాస్‌ నారంగ్‌, పీ రామ్‌ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీహెచ్‌ పవన్‌ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య రియల్‌ లైఫ్‌ మామ వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో సురేష్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2rkQPBu

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...