Friday, 1 November 2019

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’: KA Paul పాట విడుదల, పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ ఓ మంచి ఎంటర్‌టైనరనే చెప్పాలి. ఆయన తీసే దాంట్లో కంటెంట్, కాంట్రోవర్సీ రెండూ సమానంగా ఉంటాయి. ప్రేక్షకులకు కావాల్సింది కూడా అదే కాబట్టి.. ఆయన ఇలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో గత్తెర్లేపిన వర్మ ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో మళ్లీ రచ్చ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ ఇప్పుడు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన పాటను విడుదల చేశారు. ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకి హడల్.. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ ఫన్నీ లిరిక్స్‌‌తో ఈ పాటను కంపోజ్ చేశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్‌గా ఓట్ల కోసం పని చేస్తారు. కానీ పాల్ మాత్రం తన కామెడీ యాంగిల్‌తో జనాలతో పాటు ఇతర రాజకీయవేత్తలను కూడా బాగా నవ్వించారు. ఆ సమయంలో పాల్ చేసిన ఫన్నీ వీడియోలు, కామెంట్లు, సెలబ్రిటీలతో ఆయన దిగిన ఫొటోలను వీడియోలో చూపించారు. ‘మనదంతా ఇంటర్నేషనల్ థింకింగ్. చిన్న చిన్నవాళ్లైన జగన్, చంద్రబాబు, కేసీఆర్ పవన్ కళ్యాణ్ కాదు మోదీ మన టార్గెట్. 2024లో ఆ సీట్ మందే. మన ప్రమాణ స్వీకారానికి ఒకరు ఇద్దరు కాదు 150 దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు తమ ఫ్యామిలీతో కలిసి వస్తారు’ అని పాల్ చెప్పిన మాటలను వీడియోలో చూపించారు. ఈ వీడియోను విడుదల చేసిన గంటలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో పాల్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. ఈ పాటను సిరాశ్రీ రాశారు. అజయ్ మైసూర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ వీడియో గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. కావాలంటే మీరే చూడండి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోకపోతే అప్పుడు అడగండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NB9nVw

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd