Wednesday, 20 November 2019

దేవీని పక్కన పెట్టిన కొరటాల శివ... కారణం అదేనా.?

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌. సుకుమార్‌, కొరటాల శివ, కిశోర్‌ తిరుమల లాంటి దర్శకుడు దేవీ లేకుండా సినిమా చేసేవారు కాదు. కానీ రాను రాను సీన్‌ మారిపోయింది. దేవీ గతంలోలా మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో దేవీ నుంచి ఒక్క బ్లాక్‌ బస్టర్ ఆల్బమ్‌ కూడా రాలేదు. దీంతో ఒక్కొక్కరుగా దేవీని పక్కన పెట్టేస్తున్నారు. ఈ లిస్ట్ ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తెరకెక్కిన చాలా సినిమాలకు దేవీ శ్రీ ప్రసాదే సంగీతమందించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సూపర్‌ హిట్ ఆల్బమ్స్‌ వచ్చాయి. అయితే సన్నాఫ్‌ సత్యమూర్తి తరువాత దేవీని పక్కన పెట్టేశాడు త్రివిక్రమ్‌. ఎక్కువగా తమన్‌ సంగీత సారథ్యం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద అల వైకుంఠపురములో సినిమా కూడా తమనే సంగీతమందిస్తున్నాడు. Also Read: తాజాగా మరో దర్శకుడు కూడా దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టేశాడు. వరుస బ్లాక్‌ బస్టర్లతో టాలీవుడ్‌ను షేక్‌ చేసిన దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడి పరిచయం అయిన కొరటాల శివ తొలి సినిమా నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. చివరగా భరత్‌ అనే నేను సినిమాకు కూడా దేవీనే సంగీతం అందించాడు. అయితే త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న మెగాస్టార్‌ చిరంజీవి సినిమా విషయంలో మాత్రం మనసు మార్చుకున్నాడు కొరటాల. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీకి బదులుగా మణిశర్మను తీసుకుంటున్నాడట. గతంలో చిరు, మణిశర్మ కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్స్‌ వచ్చాయి. కొంత కాలంగా పెద్ద సినిమాలకు దూరంగా ఉంటున్న మణిశర్మ ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. దీంతో చిరు, కొరటాల సినిమాకు కూడా మణినే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. దేవీ కూడా కొంత కాలంగా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. దీంతో మణినే కరెక్ట్ చాయిస్‌ అనుకుంటున్నారట చిరు టీం. Also Read: అంతేకాదు మరో యంగ్‌ డైరెక్టర్‌ కూడా దేవీని కాదని మణీకే ఛాన్స్‌ ఇస్తున్నాడు. నేను శైలజ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న దర్శకుడు కిశోర్‌ తిరుమల. ఇప్పటివరకు తన సినిమాలన్నింటికీ దేవీతోనే సంగీతం చేయించుకున్న కిశోర్‌ తిరుమల కూడా తన నెక్ట్స్ సినిమాకు మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. రామ్‌ హీరోగా కిశోర్‌ తెరకెక్కిస్తున్న రెడ్‌ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XzdRAF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....