Sunday, 24 November 2019

బిగ్‌బాస్ భామ హాట్ ఫొటో..నెంబర్ కావాలంటూ చుక్కలు చూపించిన ఫ్యాన్స్

హాట్ హీరోయిన్ సరదాగా ఫొటో పోస్ట్ చేస్తే అభిమానులు ఆమెకు కామెంట్స్‌తో చుక్కలు చూపించారు. ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బెడ్‌పై పడుకుని పక్కన ఓ టెలిఫోన్ పెట్టుకుని అదిరిపోయే స్టిల్ దిగింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. ఇందుకు కారణం రైజా ఆ ఫొటోకు ఇచ్చిన క్యాప్షనే. ‘నా ల్యాండ్‌లైన్‌కు కాల్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా? నెంబర్ ఇవ్వకుండా ఎలా కాల్ చేయమంటారా? నెంబర్ ఇవ్వండి అంటూ వరుసగా కామెంట్లు పెట్టారు. ఈ ఫొటోకు దాదాపు ఐదు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 2017లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన రైజా విల్సన్ ‘వీఐపీ 2’ సినిమాలో కాజోల్‌ పక్కన అసిస్టెంట్‌గా చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఈ పాత్రకు ఆమెకు క్రెడిట్ దక్కలేదు. ఆ తర్వాత ‘ప్యార్ ప్రేమా కాదల్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో ఆమె హరీష్ కళ్యాణ్‌కు జోడీగా నటించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రైజాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నటీమణులకు సోషల్ మీడియాలో పెట్టే హాట్ ఫొటోల వల్ల అవకాశాలు వస్తున్నాయి కానీ వారి ట్యాలెంట్‌‌కి కాదని తెలుస్తోంది. ఎందకంటే ఈ మధ్యకాలంలో కాస్త సంప్రదాయంగా ఉంటే హీరోయిన్లు కూడా గ్లామర్ డోస్ పెంచేసి మరీ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టేస్తున్నారు. దీని వల్ల ఫాలోయింగ్ పెరిగిపోయి అవకాశాలూ వస్తున్నాయి. ప్రస్తుతం రైజా చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. ‘ఆలిస్’, ‘కదలిక్క యారుమిల్లాయ్’, ‘ఎఫ్‌ఐఆర్’ సినిమాల్లో నటిస్తున్నారు. సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్‌ 1లో రైజా పాల్గొన్నారు. ఈ షో ఆమె సినీ కెరీర్‌ను స్టార్ట్ చేయడానికి బాగా ఉపయోగపడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2pRswuO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....