Saturday, 23 November 2019

ప్రతి రోజూ నీ కోసమే ప్రార్థిస్తా.. ఐ లవ్‌ యూ డార్లింగ్‌: సమంత

అక్కినేని నట వారసుడు యంగ్ హీరో నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య, స్టార్ హీరోయిన్‌ సమంత శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం గోవాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చై సామ్‌, ఓ రొమాంటిక్‌ ఫోటోను అభిమానుల కోసం ట్వీట్ చేశారు. చైతూతో సమంత కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసి సమంత హార్ట్‌ టచింగ్‌ కామెంట్‌ చేసింది. `పుట్టిన రోజు శుభాకాంక్షలు చై. నేను ప్రతి రోజూ నీ ఆనందం కోసమే ప్రార్థిస్తాను. నువ్వు ప్రతి రోజు సరికొత్తగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవటం నాకు గర్వంగా ఉంది. ఐ లవ్‌ యూ డార్లింగ్‌ హజ్బెండ్‌` అంటూ కామెంట్ చేసింది సమంత. యంగ్ హీరో అఖిల్ కూడా అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. `ఈ పుట్టిన రోజున నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకు నువ్వు అర్హుడివి. నువ్వు ఎప్పుడు మంచి అన్నవి, లవ్‌ యూ సోమచ్‌ మై మ్యాన్‌` అంటూ ట్వీట్ చేశాడు.మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా తన బావమరిది చైతన్యకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల మజిలీ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మామ వెంకటేష్‌తో కలిసి చేస్తున్న వెంకీ మామ చివరి దశకు చేరుకోగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Da7yu1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....