Monday, 18 November 2019

`త్వరలో పెళ్లి డేట్‌ చెప్తా.. పవన్‌ సినిమా కోసం ఏదైనా వదిలేస్తా`

త్వరలో అర్జున్‌ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్‌ హీరో నిఖిల్‌ ఆసక్తి్కర ప్రకటన చేశాడు. ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అర్జున్‌ సురవరం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో ముచ్చటించాడు ఈ యంగ్ హీరో. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేశాడు నిఖిల్‌. ప్రస్తుతం అర్జున్‌ సురవరం సినిమా ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో త్వరలోనే తన పెళ్లి ప్రకటిన ఉంటుందని వెళ్లడించాడు. అర్జున్‌ సురవరం రిలీజ్‌ అయిన వెంటనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తానని చెప్పాడు. Also Read: తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రిలీజ్‌ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తన ఆనందాన్ని చిత్రయూనిట్‌తో పంచుకుంటున్నట్టుగా వెళ్లడించాడు. ప్రస్తుతం దర్శకుడు వీఐ ఆనంద్‌ డిస్కో రాజా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడన్న నిఖిల్‌, తాను కూడా అక్కడికి వెళ్లి సెలబ్రేట్‌ చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల ట్రెండ్‌ కనిపిస్తుండటంతో తాను కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాని చెప్పాడు. గతంలో రానాతో కలిసి ఓ సినిమా చేసే అవకాశం వచ్చినా వర్క్‌ అవుట్‌ కాలేదని వెల్లడించాడు. మంచి కథ వస్తే ఈ సారి తప్పకుండా మల్టీస్టారర్‌ సినిమా చేస్తానని చెప్పాడు. Also Read: అంతేకాదు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మీద తన అభిమానాన్ని మరోసారి వ్యక్తపరిచాడు. పవన్‌ తో కలిసి నటించే అవకాశం వస్తే తన సినిమా వదిలేసి మరి వెళ్లిపోతానని చెప్పాడు. తన నిర్మాతకు వచ్చే నష్టా్ని తాను భరించైనా పవన్‌ కళ్యాణ్ సినిమాలో నటిస్తానని చెప్పాడు. తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా అర్జున్‌ సురవరం. టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించినా తరువాత వివాదం తలెత్తడంతో అర్జున్‌ సురవరంగా మార్చారు. రిలీజ్‌ విషయంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అర్జున్‌ సురవరం నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3313IxZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....