Sunday, 3 November 2019

మోహన్‌బాబు ఎప్పుడూ ఏదొకటి గెలుకుతూ ఉంటాడు: చిరంజీవి

తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర‌జ‌తోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుకల్లో భాగంగా సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలను చిరంజీవి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడకు రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత నేను అత్యధికంగా గౌరవించిచేది, సన్నిహితంగా వుండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. అంతటి గౌరవాన్ని ఇస్తుంటాను. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. మొన్నీమధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాం. అందమైన వెండి సింహానం వుంది. అది చూడగానే.. సత్యానంద్‌ను రాఘవేంద్రరావు కూర్చో పెట్టారు. దూరం నుంచి చూస్తున్న నాకు.. కరెక్టేకదా, ఆ స్థానాన్ని అలంకరించే అర్హుడు ఆయనేకదా అనిపించింది. అది ఒక్క సత్యానంద్‌నే కాదు రచయితలందరినీ గౌరవించినట్టు అని నేను ఫీలయ్యాను. అందరం ఆయన దగ్గరకు వెళ్లి ఒక ఫొటో దిగాం. సత్యానంద్‌గారిని కాలుమీద కాలేసుకోమని చెప్పాం. ఆయన స్వభావం కాకపోయినా మేం చెప్పామని వేసుకున్నారు. ఆ సమయంలో మోహన్ బాబు.. ఎప్పుడూ ఏదో గెలుకుతూ ఉంటాడు కదా ఆయన. ఏమయ్యా.. రాఘవేంద్రరావును నిలబెట్టి, సత్యానంద్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. దర్శకేంద్రుడయ్యా.. ఆయన్ని అవమానిస్తావా అన్నారు. నేను వెంటనే.. రాఘవేంద్రరావు అమరశిల్పి జక్కన్న. ఉలి, సుత్తి ఆయన చేతిలో ఉంటుంది. ఆయన దేన్ని చెక్కాలి.. ఒక శిల ఉండాలి కదా.. ఆ శిలేనయ్యా సత్యానంద్ గారు అన్నారు. సత్యానంద్ మనసులో నుంచి వచ్చిన కథను రాఘవేంద్రరావు అందంగా చెక్కుతారు. ఆ రకంగా ఆయన దిట్ట. రాఘవేంద్రరావును తక్కువ చేయటం కాదయ్యా.. సత్యానంద్ లాంటి రచయితలను గౌరవించుకోకపోతే మనకు మనుగడు లేదు అని గుర్తుచేస్తున్నాను అని అన్నాను. ఇదంతా ఆ సాయంకాలం సరదాగా జరిగింది’’ అని నవ్వుతూ చెప్పారు చిరంజీవి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నారు. ఆ తరవాత సినీ రచయితలతో తనకున్న అనుబంధం గురించి చిరంజీవి చెబుతూ.. ‘‘పరుచూరి బ్రదర్స్‌తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. ‘మగమహారాజు’కు రాసిన ఆకెళ్ళ ఇక్కడే వున్నారు. వీరందరికీ నా కృతజ్ఞతలు. ఈ సభకు నన్ను పిలకపోయివుంటే అసంతృప్తిగా వుండేవాడిని. గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతుల మీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. నాకు ఆదివిష్ణు గారితో పరిచయం తక్కువ. ఆయన సినిమాలకు తక్కువరాసినా జంథ్యాలగారితో అనుబంధం చాలా గొప్పది. నాటకరచయితగా అద్భుతాలు చేశారు. ఇక రావికొండలరావుగారు నాటక రచయితగా, సంపాదకుడిగా, నటుడిగా, సాహితీవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు, రమణలకు అత్యంత ఆప్తుడు ఆయన. ఇక కోదండరామిరెడ్డిగారితో 25 సినిమాల సుదీర్ఘ ప్రయాణం మాది. దర్శకుడిగాకంటే ఆత్మీయుడు, స్నేహతుడిగా కన్పిస్తాడు. కల్మషం లేని వ్యక్తి. ఇక భువన చంద్రగారు.. ఆయన మిలట్రీ మనిషి. విజయ బాపినీడుగారు మొదటిసారి.. ‘ఖైదీ నెం.786’తో పరిచయం చేశారు. ఆరుద్ర, ఆత్రేయగారి టైంలో ఈయన రాస్తారా అనిపించింది. ఆ తర్వాత ఆయన రాసిన విధానం చూశాక.. రణరంగంలో గన్‌తో పేల్చినట్లు.. సినీకలంతో విజృంభించారు. ఆయన రాసిన మూడు పాటలు.. నేటితరం రీమిక్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘గువ్వాగోరింకతో’, ‘బంగారు కోడిపెట్ట’, ‘వాన వాన వెల్లువాయె’ వంటివి అందుకు నిదర్శనం. ఇలా వీరందరినీ సత్కరించుకోవడంతోపాటు నా కృతజ్ఞతను తెలుపుకోవడానికి అవకాశం కల్గింది. ఇంకా సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు కూడా వచ్చివుంటే బాగుండేది. అది లోటుగా భావిస్తున్నా. వారిద్దరు మనకు నిధి లాంటివారు. మాయాబజార్‌ నుంచి ఈ కాలం వరకు వున్న వ్యక్తులు. వారు రాలేకపోయారు. ముందుముందు వారిని సన్మానించుకునే అకవాశం నాకు ఇవ్వగలిగితే బాగుంటుంది’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2oLy9dq

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw