Saturday, 2 November 2019

మోదీ సెక్యూరిటీ మా ఫోన్లు లాగేసుకున్నారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు సౌత్‌ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే సౌత్‌లో అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. మెగా కోడలు, రామ్‌ చరణ్‌ సతీమణి ట్విటర్‌ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించారు. దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ మీట్‌పై మరో సౌత్‌ లెజెండ్ స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సౌత్‌ ను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం హారయ్యారు. Also Read: ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన ఆయన ఆనందంతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. `రామోజీరావుగారి కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని ఎంట్రన్స్‌ దగ్గర మా ఫోన్లు సెక్యూరిటీ వారికి అప్పగించి వెళ్లాలని కోరారు. Also Read: ఫోన్లు తీసుకొని మాకు టోకెన్లు కూడా ఇచ్చారు. కానీ లోపలికి వెళ్లే సరికి స్టార్స్‌ మోదీతో తమ సెల్‌ఫోన్లలో సెల్పీలు దిగుతున్నారు. ఈ సంఘటన నిరుత్సాహానికి గురిచేసింది` అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ సినీ తారలు షారూఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లతో పాటు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. సౌత్‌ నుంచి దిల్‌ రాజుతో పాటు ఎస్పీబీలు పాల్గొన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JLaa5l

No comments:

Post a Comment

'3-Language Formula Is A Burden On All Students'

'Why should children, who are already burdened with so many subjects, be over-burdened with three languages?' from rediff Top Inte...