Saturday, 2 November 2019

నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి `రాజు`గారు.. వర్మకు రాజమౌళి ట్వీట్‌

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే వివాదంలోకి సినీ ప్రముఖులను లాగిన వర్మ తాజాగా రాజమౌళిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశాడు. శనివారం ఉదయం సినిమాలోని కేఏ పాల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన వర్మ, ఆసక్తికర ట్వీట్ చేశాడు. `ఇండియాలో జోకర్‌ సినిమా అంతటి ఘనవిజయం సాధించిందంటే.. కేఏ పాల్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే అది బాహుబలి 3 కన్నా ఘన విజయం సాధిస్తుంది. ఇప్పటికే .. వాషింగ్టన్‌ డీసీలో కేఏ పాల్‌లో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కేఏపాల్‌ స్వయంగా నాకు ఫోన్‌ చేసి చెప్పాడు` అంటూ ట్వీట్ చేశాడు. Also Read: అయితే ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రాజమౌళి `నన్ను ఇన్వాల్వ్ చేయకండి `రాజు`గారు` అంటూ రిప్లై ఇచ్చారు. వర్మ కూడా వెంటనే రాజమౌళి ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. `సర్‌ సర్‌ సర్‌ నేనేం చేయటం లేదు. కేఏ పాలే నాకు ఆ విషయం చెప్పాడు. మీరు పాల్‌లో కలిస ట్రంప్‌ టవర్‌లో కూర్చొని లంచ్‌ చేశారని, మీరు బాహుబలి 3 కోసం పాల్‌ను తీసుకున్నారని చెప్పాడు. కేఏ పాల్ మీద ఒట్టేసి చెపుతున్నా` అంటూ రిప్లై ఇచ్చాడు. Also Read: ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36rUQUY

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw