Thursday, 23 January 2020

‘డిస్కోరాజా’ ట్విట్టర్ రివ్యూ: రవితేజ హిట్ ట్రాక్ ఎక్కినట్టే..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉండేది. థియేటర్‌కు వెళ్తే మినిమం గ్యారంటీ ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని ప్రేక్షకులు ఫీలయ్యేవారు. నిజమే.. సినిమా అంతటినీ తన భుజస్కందాలపై మోయగల సత్తా ఉన్న నటుడు రవితేజ. కానీ, ఈ మధ్య ఆయనకు కాలం కలిసిరావడంలేదు. గత కొన్ని సంవత్సరాలుగా రవితేజ ట్రాక్ చూసుకుంటే హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్లు రవితేజ స్టామినాను చెప్పాయి. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించారు. కానీ, ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాలు ఆయన్ని ఒక్కసారిగా వెనక్కి లాగేశాయి. ఎవ్వరూ ఊహించిన రీతిలో ఈ మూడు సినిమాలు డిజాస్టర్లు అయిపోయాయి. అయినప్పటికీ నిర్మాతలకు మాస్ మహారాజాపై నమ్మకం పోలేదు. వరుసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రవితేజ ఎంపిక చేసుకున్న విభిన్నమైన చిత్రం ‘డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ‘డిస్కోరాజా’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇది ఒక డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా ఇరగదీశారని కొంత మంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ అని ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ కొత్త అవతారంలో అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన భుజస్కందాలపై మోసరని కూడా చెబుతున్నారు. వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించారని అంటున్నారు. సునీల్‌కు కూడా మంచి పాత్ర దక్కిందని కొంత మంది ట్వీట్లు చేశారు. క్లైమాక్స్‌లో ఆయన కుమ్మేశారట. విలన్‌గా బాబీ సింహా అదరగొట్టారని అంటున్నారు. తమన్ మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట. మొత్తంగా సినిమా బాగుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కాస్త నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. కొంతమంది రవితేజ మరోసారి నిరాశపరిచారని నిట్టూరుస్తున్నారు. స్టోరీ లైన్ వెరైటీగా ఉన్నా దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో సినిమాను రొటీన్‌గా మార్చేశారని అంటున్నారు. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాకు సైన్స్ ఫిక్షన్ అనే ట్యాగ్ తగిలించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఓవరాల్‌గా రవితేజ హిట్టు కొట్టినట్టే కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడితే అసలు టాక్ బయటికి వచ్చేస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vdgbmN

Wednesday, 22 January 2020

Sony May Unveil Its First 5G Flagship Phone at MWC 2020

Sony is said to be in plans to launch its first 5G phone based on Qualcomm Snapdragon 865 SoC at MWC 2020 in Barcelona. The company last week sent out invites for its MWC press conference.

from NDTV Gadgets - Latest https://ift.tt/38DCEbn

Netflix to Release Taj Mahal 1989, Amit Tandon's Comedy Special in February

Netflix has set two originals from India in February 2020: a stand-up comedy special from Amit Tandon called 'Amit Tandon: Family Tandoncies', and romantic drama series Taj Mahal 1989, which was...

from NDTV Gadgets - Latest https://ift.tt/37k9ai9

Comedian Sunil: కమెడియన్ సునీల్‌కి అస్వస్థత.. హాస్పటల్‌లో వైద్యం

కమెడియన్, హీరో సునీల్‌కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఎక్కువగా యాంటిబయోటిక్ మాత్రలు వేసుకోవడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే బుధవారం రాత్రి ఆయనకు వ్యాధి తీవ్రత పెరగడంతో హుటా హుటిన గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. సునీల్‌ని పరీక్షించిన డాక్టర్స్ ఆయనకు యాంటిబయోటిక్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాత్రి నుండి వైద్యం అందించడంతో సునీల్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేనట్లు తెలస్తోంది. కాగా సునీల్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం విజయవంతం కాగా.. రవితేజ ‘డిస్కో రాజా’లో కీలకపాత్ర పోషించారు సునీల్. ఈ సినిమా రేపు (శుక్రవారం) కానుండగా.. అనారోగ్యంగా కారణంగా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారు సునీల్. గత ఆదివారం నాడు జరిగిన ‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ తన ప్రసంగంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37jhoXT

ప్రభాస్, కృష్ణం రాజు సినిమా.. అయ్యో ఆగిపోయిందే

యంగ్ రెబెల్ స్టార్ ఎందరితో సినిమాలు చేసినా.. తన పెదనాన్న కృష్ణం రాజు డైరెక్షన్‌లో నటిస్తే చూడాలని ఎందరో ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. వారి కోరికను కృష్ణం రాజు కూడా నెరవేర్చాలని అనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే పైవాడు మరొకటి తలుస్తాడు అన్నట్లు ఆ సినిమాను ఆపేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను కూడా కృష్ణం రాజు రెడీ చేసి పెట్టుకున్నారు. సినిమాకు ‘ఒక్క అడుగు’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఒక్క అడుగు’ అని డార్లింగ్ చెప్పే డైలాగ్ బాగా హైలైట్ అయింది. దానినే టైటిల్‌గా పెట్టాలనుకున్నారు కృష్ణం రాజు. అయితే కృష్ణం రాజు ప్రభాస్‌తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ‘సాహో’ సినిమా అడ్డొచ్చింది. దాంతో ప్రభాస్ తన డేట్లను సుజీత్‌కు ఇచ్చేశారు. ఆ తర్వాతైనా సినిమా తీద్దామని అనుకున్నారు కానీ ప్రభాస్ రాధాకృష్ణతో ‘జాన్’ సినిమాకు ఫిక్స్ అయ్యారు. దాంతో ఇక సినిమా తీసే ఆలోచనలను మానుకున్నారు కృష్ణం రాజు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు. READ ALSO: ఇప్పుడు తనకు వయసు అయిపోయిందని, డైరెక్ట్ చేసే ఓపిక లేదని తెలిపారు. ప్చ్.. అలా ఓ చక్కటి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. అయితే ఇదే టైటిల్‌తో ప్రభాస్ మరో డైరెక్టర్‌తో కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఆ తర్వాత ఆస్ట్రియాలో షూటింగ్ అవుతుంది. ఇందులో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RkzK5k

Bhuvan Bam: From India's Beloved YouTube Comedian to a Davos Summit Guest

Popular YouTube comedian Bhuvan Bam, known for his viral BB Ki Vines videos, has invited to the World Economic Forum's Davos Summit, where he had a chance to rub shoulders with the world's elite.

from NDTV Gadgets - Latest https://ift.tt/37ieYsM

Google Details Security Flaws in Apple's Safari Browser

Google researchers have detailed multiple security flaws they found in Apple's Safari Web browser that allowed the tracking of users' browsing behaviour.

from NDTV Gadgets - Latest https://ift.tt/37iD5aA

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....