''None of the existing vaccines have 100% efficacy.'
from rediff Top Interviews https://ift.tt/3fDl2kr
Tuesday, 24 November 2020
కిడ్నీ వ్యాధితో పోరాడుతూ ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు, టీవీ ఆర్టిస్ట్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 55 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. మే నెల నుంచి కిడ్నీకి సంబంధించి ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారని తెలిపారు. ఆయన మృతి పట్ల సినీ వర్గాలు సంతాపం తెలుపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆశీష్ రాయ్ అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. పలు మార్లు చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు కానీ ఆర్ధిక సమస్యలతో మెరుగైన వైద్యం అందుకోలేకపోయారని సమాచారం. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెబుతూ ఆయన ఆవేదన చెందారు. Also Read: దాదాపు 23 ఏళ్ల పాటు కెమెరా ముందు కదులుతూ అలరించారు ఆశీష్ రాయ్. ''బనేగి అప్నీ బాత్, ససురాల్ సిమర్ కా, రీమిక్స్, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసీ భీ'' లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆయన నటించారు. ''నేతాజీ సుభాష్ చంద్రబోస్, హోమ్ డెలివరీ, మేరా పహ్లా పహ్లా ప్యార్'' లాంటి హిందీ సినిమాల్లో కూడా నటించి వెండితెరపై తన మార్క్ వేసుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/375K3Rh
Twitter to Warn Users Before They Like a Labelled Tweet
Twitter will start showing you a warning when you try to like a tweet that has been labelled for potentially including misleading information. This is rolling out to iOS and the Web globally this...
from NDTV Gadgets - Latest https://ift.tt/2HAzFsk
from NDTV Gadgets - Latest https://ift.tt/2HAzFsk
Some Apple HomePod mini Users Are Having Wi-Fi Connectivity Issues
Some users of Apple's newly launched HomePod mini are facing connectivity issues with the smart speaker, and there doesn't seem to be a fix for the problem yet. The issue seems to be specific to...
from NDTV Gadgets - Latest https://ift.tt/3fr4XhL
from NDTV Gadgets - Latest https://ift.tt/3fr4XhL
Monday, 23 November 2020
షూటింగ్ మధ్యలో శృతిహాసన్ జంప్.. ఇదీ అసలు కారణం!!
కమల్‌హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ సౌత్ ఇండియన్ తెరపై భారీ పాపులారిటీ కూడగట్టుకొని ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన శృతిహాసన్ కొన్ని రోజులపాటు సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉండి తిరిగి రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చింది. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న శృతి.. ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా, సెట్స్ మీదనుంచి అనూహ్యంగా బయటకు వెళ్లడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాభం` అనే తమిళ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందుకోసమై శృతి సెట్స్ మీదకు రాగా.. ఆయా పరిసర ప్రాంతాల నుండి ఆమెను చూడటానికి పెద్దఎత్తున జనం తరలివచ్చారట. దీంతో శృతిహాసన్ ఆ షూటింగ్‌ని మధ్యలోనే వదిలేసి జంప్ కావడమే గాక, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చిత్రీకరణ ఎలా చేస్తున్నారంటూ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిసింది. Also Read: గతంతో పోల్చితే కరోనా భయం కాస్త తగ్గినా ప్రస్తుతం దేశవిదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇదే శృతిహాసన్ అలా షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళడానికి కారణం అని సమాచారం. అంతమంది జనం ఒక్కచోట చేరడం చూసి కరోనా భయంతో శృతి ఆ ప్రదేశం వదిలి వెళ్లిందట. పైగా కోవిడ్-19 వల్ల ప్రతిఒక్కరి ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. అది ఇంకా అంతరించిపోలేదు. కరోనా ప్రోటోకాల్స్ పాటించని పక్షంలో.. ఓ మహిళగా, నటిగా నా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉందని ఇటీవలే శృతి పేర్కొంది. దీంతో తాజా సంఘటన చూసి శృతి చెప్పిందే చేసిందిగా అంటున్నారు జనం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m1lGuz
సినీ అసిస్టెంట్ డైరెక్టర్ మిస్సింగ్... పోలీసుల గాలింపు
తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ అనే యువకుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్తీక్(24) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ మధురానగర్‌లో నివాసముంటూ సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం తన కొడుకు కనిపించడం లేదని కార్తీక్ తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: కొద్దిరోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కార్తీక్ ఆ మరుసటి రోజే హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇంటికి కాకుండా మాదాపూర్‌లోని ఫ్రెండ్స్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి స్నేహితులతో పంజాగుట్ట చేరుకున్న కార్తీక్ ఇంటికి మాత్రం చేరుకోలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కార్తీక్ తండ్రి లక్ష్మీనారాయణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: కార్తీక్ ఇటీవల తన స్నేహితులైన వంశీ, క్రాంతి, నివాస్ తదితరులతో కలిసి ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ కోసం రూ.10లక్షలు పెట్టించాడని ఫిర్యాదులో ఆయన తండ్రి పేర్కొన్నారు. అందులో నష్టం రావడంతో ఫ్రెండ్స్ నుంచి ఒత్తిడి పెరిగిందని, దాన్ని తట్టుకోలేకే కనిపించకుండా పోయి ఉంటాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చేపట్టారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pZEXiu
నీ చుట్టూ ఉన్నవాళ్లు అబ్జర్వ్ చేస్తారు.. జాగ్రత్త! అన్నింటికంటే అదే ముఖ్యం.. పూరి పాఠం వినాల్సిందే..
గత కొన్నిరోజులుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్ కాస్ట్ ఆడియోలను రిలీజ్ చేస్తున్న సమాజంలోని విభిన్న అంశాలపై స్పందిస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్ని విషయాల్లో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మనపై మనకు నియంత్రణ అనేది అవసరం అని పేర్కొంటూ '' అనే టాపిక్‌పై ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇందులో పూరి చెప్పిన కొన్ని విషయాలు వాస్తవికతకు దగ్గరగా ఉండి ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇందులో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''ఐక్యూ చాలా మందికి ఉంటుంది. ఈక్యూ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. దీనినే ఎమోషనల్ ఇంటిలిజెన్స్ అంటారు. ఇట్స్ ఎన్ ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ అండ్ మెనేజ్ యువర్ ఎమోషన్స్. ఈ ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ఉన్నోళ్లు.. గుడ్ లీడర్స్ అవుతారు. ఇందులో నాలుగు ఉంటాయ్. సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ మ్యానేజ్‌మెంట్, సోషల్ అవేర్‌నెస్, రిలేషన్‌షిప్ మ్యానేజ్‌మెంట్. ఈ నాలుగూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, స్ట్రెంత్, వీక్‌నెస్.. ఇవన్నీ తెలియకుండా మనల్ని డ్రైవ్ చేస్తుంటాయ్. అందుకే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హౌ యు రియాక్ట్ టు పీపుల్. వాళ్లని ఎలా పలకరిస్తున్నావ్? ఎలా మాట్లాడుతున్నావ్? చెక్ చేసుకోవాలి. వాళ్లతో మనం మాట్లాడే విధానం ఎలా ఉందో గమనించాలి. అలాగే ఒత్తిడి పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిప్రెస్ అవుతున్నామా? గట్టిగా అరుస్తున్నామా? లేదా గట్టిగా ఏడుస్తున్నామా? ఇవన్నీ నువ్ అబ్జర్వ్ చేయకపోయినా.. నీ చుట్టూ ఉన్నవాళ్లు అబ్జర్వ్ చేస్తారు. అందుకే మనం ఏంటో మనకి తెలియాలి. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దానిని నువ్ డీల్ చేసే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు. వర్క్ చేసే చోట కూడా కామ్‌గా ఉండటం, అవతలి వాళ్లు చెప్పేది వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ జరిగితే ఎప్పుడూ ఎస్కేప్ అవ్వవద్దు. ఆ బాధ్యతను మీరే తీసుకోండి. మనలో ఉన్న ఎమోషన్స్ తగ్గించుకోవాలి. ఎంత గుడ్ న్యూస్ విన్నా డాన్సులు చేయడం, అరవడం లాంటివి చేయకూడదు. బ్యాలెన్స్ మైండ్‌ని అందరూ నమ్ముతారు. వాళ్లనే సలహా అడుగుతారు. ఫ్రెండ్స్ గానీ, రెలెటివ్స్ గానీ సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అందరి జీవితంలో 'ఎమోషనల్ ఇంటలిజెన్స్' అనేది చాలా ముఖ్యం'' అని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J7csyq
Subscribe to:
Posts (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'... with the rest split between mid and smallcaps, as valuations are becoming more attractive across segments.' from rediff Top I...
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...