Monday, 1 July 2019

మేఘాంశ్ బ్లడ్‌లోనే ఉంది: శాంతి శ్రీహరి

దివంగత నటుడు, రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం ‘రాజ్‌దూత్’. న‌క్షత్ర, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్షన్స్ పతాకంపై అర్జున్-కార్తీక్ ద‌ర్శక‌త్వంలో ఎమ్.ఎల్.వి. స‌త్యనారాయ‌ణ‌ (స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్షన్ సెంట‌ర్లో సినీ ప్రముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో శ్రీహరి భార్య శాంతితో పాటు ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, బెల్లంకొండ సరేష్, దర్శకులు బాబి, దేవీ ప్రసాద్, ఇ.సత్తిబాబు, శ్రీరామ్ ఆదిత్య, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మేఘాంశ్ తల్లి శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ.. ‘మేఘాంశ్ "భైర‌వ" సినిమాలో న‌టించాడు. అదే త‌న తొలి సినిమా. ఇది రెండో సినిమా. పాఠాలు చ‌ద‌వ‌డు. డైలాగులు పేజీలు పేజీలు బాగా చ‌దువుతాడు. అప్పుడే అర్థమైంది నాకు. బ్లడ్‌లోనే అది ఉంది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత శ్రీహ‌రిగారి పేరును నిల‌బెడ‌తాడ‌న్న న‌మ్మకం వ‌చ్చింది. ఈ కార్యక్రమానికి వ‌చ్చిన అంద‌రికీ ప్రత్యేకంగా కృజ్ఞతలు. శ్రీహ‌రిగారికి ఇచ్చిన స‌పోర్ట్ నా బిడ్డల‌కు ఇస్తార‌ని ఆశిస్తున్నా’ అని అన్నారు. నిర్మాత సి. క‌ల్యాణ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం మా బావ‌( శ్రీహ‌రి). ఇద్దరిది 35 ఏళ్ల అనుబంధం. నాకు హైద‌రాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. శ్రీహ‌రి నిల‌యం దానిపేరు. శాంతి చేతుల మీదుగా ఆ ఇల్లు ప్రారంభించింది. నిర్మాత స‌త్తిబాబు నాకు షాకిచ్చాడు. శ్రీహ‌రి గారి అబ్బాయితో నేను సినిమా చేయాలి? కానీ ఆయన చేసేశారు. ఎన్టీఆర్ త‌ర్వాత‌ శ్రీహ‌రి చ‌నిపోయిన‌ప్పుడే అంత జ‌నం వ‌చ్చారు. 16 కిలోమీట‌ర్ల మేర జ‌నం న‌డుచుకునే వ‌చ్చారు. ఇంటికి ఉండే అన్ని కాంపౌండ్ వాల్స్ ప‌డిపోయాయి. అంటే మా బావ‌ అంత అభిమానం సంపాదించుకున్నారు. త‌న‌తో జ‌ర్నీ చేసిన వారు ఎప్పటికీ ఆయన్ని మ‌ర్చిపోరు. ప్రతీ నిర్మాత బావ గురించి ఎలా మాట్లాడుకునేవారో.. మేఘాంశ్ గురించి అలాగే మాట్లాడుకోవాలి. తండ్రిలా పెద్ద స్టార్ అవ్వాలి. "రాజ్‌దూత్" టీమ్‌లో మంచి ఫైర్ ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకు రావాలి’ అని అన్నారు. హీరో మేఘాంశ్ మాట్లాడుతూ.. ‘అమ్మానాన్నల వ‌ల్లే ఇక్కడ ఉన్నాను. డాడీ లేక‌పోవ‌డంతో మ‌మ్మల్ని పెంచ‌డానికి అమ్మ చాలా క‌ష్టప‌డింది. ఇక సినిమా విష‌యానకి వ‌స్తే జ‌న‌వ‌రిలో స్టార్ట్ చేసాం. త‌క్కు టైమ్‌లో షూటింగ్ పూర్తిచేసాం. మా ద‌ర్శకులు ఇద్దరైనా ఒక‌రిగా ప‌నిచేసారు. చాలా క్లారిటీగా తీసారు. ఆదిత్య మీన‌న్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేసారు. సుద‌ర్శన్ పాత్ర బాగా న‌వ్విస్తుంది. ప్రియాంక‌, న‌క్షత్రల‌తో ప‌నిచేయ‌డం వెరీ హ్యపీ. అంతా చాలా క‌ష్టప‌డి ప‌నిచేసాం. జూలై 5న రిలీజ్ అవుతుంది. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌కండి. థియేట‌ర్‌కు వ‌చ్చి చూడండి’ అని అన్నారు. ద‌ర్శకుడు బాబి మాట్లాడుతూ శ్రీహ‌రిలో దేవుడు క‌నిపించేవారని, ఆయన "భ‌ద్రాద్రి" సినిమాతో రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించానని చెప్పారు. తాను నిర్మాతగా ఈ స్థానంలో ఉండటానికి శ్రీహరే కారణమని బెల్లంకొండ సురేష్ అన్నారు. శ్రీహరి ఉండుంటే చాలా మంది నిర్మాతలను ఇండస్ట్రీకి వచ్చి ఉండేవారని సురేష్ అభిప్రాయపడ్డారు. మహా సముద్రంలాంటి మహావ్యక్తి శ్రీహరి అని కొనియాడారు. తొందరపడి మధ్యాహ్నమే అస్తమించిన సూర్యుడు శ్రీహరి అని దర్శకుడు దేవీ ప్రసాద్ అన్నారు. తనను దర్శకుడిగా గుర్తించిన మొదటి వ్యక్తి శ్రీహరి అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KPtxfG

AMD Denies Report That It Improperly Shared Chip Technology With China

AMD has dismissed reports that it had improperly transferred critical microprocessor technology to Chinese partners.

from NDTV Gadgets - Latest https://ift.tt/2xjUnDN

LG Launches Stylo 5 Smartphone With Stylus Support, 3,500mAh Battery

LG has unveiled a new phone called LG Stylo 5, which packs a large 6.2-inch display and comes with a stylus.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Lus4Lw

This Wrist Band Can Help You Monitor Your Emotions

Researchers have found that smart wearable technology that changes colour, heats up, squeezes or vibrates have the potential to help people with effective emotional disorders.

from NDTV Gadgets - Latest https://ift.tt/2FJBLlj

Sunday, 30 June 2019

'Gandhi family is the only fulcrum of the Congress'

'As of today, I don't see how the Congress can continue its struggle against the BJP without Rahul. There has to be a fulcrum. There has to be a center for any movement to take place.'

from rediff Top Interviews https://ift.tt/2YxlyY5

Sunidhi Chauhan, Armaan Malik to Sing in Hindi for The Lion King

Sunidhi Chauhan and Armaan Malik will lend their voices to the Hindi-language soundtrack of the upcoming remake of The Lion King, Disney India has announced. They will cover "Can You Feel the Love...

from NDTV Gadgets - Latest https://ift.tt/303lvDl

Apple to Reportedly Improve Its News+ Service After Poor Start

Apple's News+ service is reportedly in for a design overhaul, among other improvements. Multiple publishers have been unimpressed with the revenue generated from Apple News+.

from NDTV Gadgets - Latest https://ift.tt/2J1tzza

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....