Sunday 5 September 2021

‘ఆయనే నేర్పించారు’ మహేష్ బాబు పోస్ట్ వైరల్.. చిన్ననాటి ఫొటోలో సూపర్‌స్టార్

అమ్మ, నాన్న తర్వాత ప్రతీ ఒక్కరి జీవితంలో అంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తి ‘గురువు’. అమ్మ జన్మనిస్తే.. నాన్న మనం బతడానికి మార్గం చూపిస్తాడు. కానీ, ఎలా బతకాలి.. అందరితో ఎలా ఉండాలి.. ఎలా గొప్పస్థాయికి వెళ్లాలి అనే విషయాలు నేర్పించే వ్యక్తి మాత్రం గురువే. అలాంటి గురువుకి ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే గురువు అంటే బడిలో పాఠాలు నేర్పించే వ్యక్తి మాత్రమే కాదు.. మన జీవితాన్ని ఏదో ఒక దశలో తన బోధనతో మలుపు తిప్పే ప్రతీ వ్యక్తిని గురువుగానే భావించాలి. అలాంటి గురువులను తలచుకొని.. వారికి పూజ చేసే రోజే సెప్టెంబర్ 5. ఈ రోజునే భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. గురువులు అందరికి ఆదర్శం.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ సందర్భంగా తమ గురువులకు సన్మానాలు చేయడం.. వాళ్లు తమ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చారో అనే విషయాలను చెప్పుకుంటూ.. జరుపుకుంటారు. ఇక ఆదివారం ఈసారి టీచర్స్ డే రావడంతో.. దేశవ్యాప్తంగా తమ గురువులను తలచుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు అందరూ. సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా ఈ జాబితాలో మినహాయింపు కాదు. ఆయన కూడా తన గురువు గురించి ట్వీట్ చేశారు. ఆయన మరెవరో కాదు.. మహేష్ తండ్రి తన తండ్రే తనకు గురువు అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ప్రతీ రోజు ఆయన్ని చూస్తూనే పెరిగాను అంటూ ఆయన పేర్కొన్నారు. ‘ప్రేమగా, ధైర్యంగా, క్రమశిక్షణతో, మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలో నాకు నేర్పిన మా నాన్నకు ధన్యవాదాలు. ఆయనతో పాటు నా ప్రయాణంలో నేను ఎదిగేందుకు సహకరించి ప్రతీ ఒక్కరికి ఎప్పటికి రుణపడి ఉంటాను’ అంటూ మహేష్ రాసుకొచ్చారు. దీంతో పాటు తన చిన్న తనంలో కృష్ణతో దిగిన ఫోటోని ఆయన జత చేశారు. ఇక మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WWHfFd

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...