Sunday 5 September 2021

క్రేజీ ప్రాజెక్ట్ నుంచి త‌మ‌న్ ఔట్‌... కార‌ణ‌మ‌దేనా..!

టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఒక‌రు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కు ఆయ‌నే సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే త‌మ‌న్‌కు ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి అనుకోని షాక్ త‌గిలింది. త‌మ‌న్‌కు తీసేసి మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు వాళ్లు ఛాన్స్ ఇచ్చార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ సినిమా ఏదో తెలుసా! అఖిల్‌, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్ ఏజెంట్‌. ఈ సినిమాకు ముందుగా త‌మ‌న్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు త‌మ‌న్ ..భీమ్లానాయ‌క్‌, స‌ర్కారువారిపాట‌, చిరంజీవి లూసిఫ‌ర్ రీమేక్‌, బాల‌కృష్ణ‌-గోపీచంద్ మ‌లినేని మూవీల‌కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న త‌మ‌న్ త‌మ సినిమాకు న్యాయం చేస్తాడో లేదోన‌ని భావించిన నిర్మాత‌లు త‌మ‌న్‌ను కాద‌ని, మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను తీసుకున్నారట‌. ఇంత‌కీ త‌మ‌న్‌ను రీప్లేస్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా.. హిప్ హాప్ త‌మిళ‌. ఈ త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ తెలుగులో ధృవ స‌హా కొన్ని ప్రాజెక్టుల‌కు సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ ద‌క్కించుకున్నార‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యంపై చిత్ర యూనిట్ కానీ, త‌మ‌న్ కానీ స్పందించ‌లేదు. ఇప్ప‌టికే విడుద‌లైన ఏజెంట్ టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అఖిల్ కూడా రొటీన్‌కు భిన్న‌మైన రోల్‌లో న‌టిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో రామ్ తాళ్లూరి అండ్ టీమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా స్టైలిష్ మూవీ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి త‌మ‌న్ త‌ప్పించ‌డం ఆయ‌న‌కు ఇబ్బందిక‌ర‌మైన విష‌య‌మే. అయితే బిజీ షెడ్యూల్ కార‌ణంగా ప్రాజెక్ట్ పాడ‌వుతుందేమోన‌ని మేక‌ర్స్ ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట. చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో తీరిక లేకుండా ఉన్న త‌మ‌న్ కూడా ఈ విష‌యంపై పెద్దగా భాధ‌ప‌డ‌లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఏజెంట్‌పై అఖిల్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VjYyPO

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...