Sunday 5 September 2021

శృతి హాసన్ బిజినెస్ ప్లాన్! జీవితాంతం అలా బతికేయొచ్చంటున్న హీరోయిన్.. స్కెచ్ మామూలుగా లేదే..

ట్రెండ్ మారింది.. నేటితరం హీరోహీరోయిన్ల ఆలోచనలు మారాయి. కేవలం సినిమాల్లో రాణించడమే కాదు ఇతర రంగాల్లోనూ తమ మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ వ్యక్తిగత ఇష్టాలను కూడా వ్యాపార ఆలోచనలుగా మార్చుకొని సత్తా చాటాలని స్కెచ్చేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని కోడలు సమంత తనకు ఇష్టమైన ఫ్యాషన్ రంగంలోకి ఎంటరై 'సాకి' పేరుతో ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించగా ఇప్పుడు కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ కూడా తన వ్యక్తిగత ఇష్టాన్ని బిజినెస్ కోణంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై అమ్మాయి అయినప్పటికీ ముంబైలో స్థిరపడిన శృతి హాసన్.. అక్కడ సౌతిండియన్‌ వంటకాలను, ఆ రుచిని బాగా మిస్‌ అవుతోందట. ఈ నేపథ్యంలోనే తన అభిరుచికి తగ్గట్లు, అలాగే ముంబైలో ఉంటున్న సౌత్ ఇండియన్ పీపుల్ కోసం ఓ స్పెషల్‌గా సౌతిండియన్‌ రెస్టారెంట్‌ నెలకొల్పాలని ఆమె ప్లాన్ చేస్తోందట. ఇలా చేస్తే ఫుడ్ విషయంలో తన కోరిక తీరడంతో పాటు దక్షిణాది వంటకాలు ఇష్టపడే వారందరి కోరిక తీరుతుందని ఆమె భావిస్తోందట. ఇటీవల చెన్నై మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ కోరికను బయట పెట్టడమే గాక పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు వంటకం మీద మంచి పట్టుందని, నలుగురికి మంచి రుచుల్ని చూపించడమంటే చాలా ఇష్టమని.. అందుకే తనకంటూ ఓ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట్లు శృతి హాసన్ తెలిపింది. తమిళ సాంబార్‌, ఆంధ్రా పప్పు, బెండకాయ కూర ఉంటే చాలు. జీవితాంతం వాటితో బతికేయొచ్చని, ఈ టేస్ట్ ముంబైలో ఉన్న అందరికీ చూపిస్తానని తన మనసులో మాటను చెప్పింది శృతి. ఈ లెక్కన త్వరలోనే షురూ కానుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రియుడు మైకేల్‌తో బ్రేకప్ తర్వాత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టిన శృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమాలో 'సలార్‌'లో హీరోయిన్‌గా నటిస్తోంది. మునుపెన్నడూ చూడనంత భారీ హంగులతో ఈ సినిమా రూపొందిస్తున్నారని టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DJ7XBT

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...